మామిడిపల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయా ప్రారంభోత్సవం

కార్యాలయాన్ని ప్రారంభించిన కోనరావుపేట మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా( Sheikh Feroze Pasha ) రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపెళ్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయన్ని మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో దేశంలో, రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందన్నారు.

స్వచ్ఛందంగా యువకులు ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుందన్నారు.తుక్కుగూడ సభలో సోనియా గాంధీ ఈ ఆరు గ్యారెంటీలు హామీ ఇచ్చి గ్యారెంటీగా అమలు చేస్తామని తెలిపారో ఈ గ్యారెంటీలను చూసి యువకులు,మహిళలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారన్నారు.

అందుకోసమే మామిడిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు .

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు,అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి వివరించి చేతి గుర్తుకు ఓటు వేసే విధంగా కృషిచేసి వేములవాడ శాసనసభ అభ్యర్థి అయినటువంటి వేములవాడ ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, స్థానికుడు, అన్నా అంటే ఆదుకునే ఆది శ్రీనన్నను భారీ మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపిస్తారని ఆశిస్తూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో సాగర్, యూత్ అధ్యక్షులు వేణు రెడ్డి,జుకంటి మల్లేశం,జి .

సంజీవరావు, ఎల్లాల రామ్ రెడ్డి,మిట్టపల్లి మల్లారెడ్డి, బడుగు దేవయ్య, బుర్ర రాజేశం గౌడ్, ఎల్లాల లింగారెడ్డి, సాసల రాజారాం, జవ్వాజి బాలయ్య, బడుగు మల్లయ్య , బుర్ర సాయి గౌడ్, వేణు, మల్లారెడ్డి, రమేష్, రఘుపతి, శంకర్ రావు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఓట్స్ ఆరోగ్య‌క‌ర‌మే.. కానీ వారు తిన‌క‌పోవ‌డ‌మే బెట‌ర్‌..!