Rythu Vedika :వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమాల ద్వారా సీఎం రైతు వేదికల ప్రారంభోత్సవం..
TeluguStop.com
06-03-2024 న మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రం లోని 110 రైతు వేదిక( Rythu Vedika )లలో వీడియో కాన్ఫరెన్స్ మాద్యమాల ప్రారంభోత్సవాన్ని ముఖ్యమంత్రి డా.
అంబేద్కర్( Dr.BR Ambedkar ) తెలంగాణ సచివాలయం లో నుండి ప్రారంభం చేయడం జరిగింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో, సిరిసిల్ల శాసన సభ నియోజకవర్గం లోని జిల్లా రైతు వేదిక చంద్రంపేట, వేములవాడ శాసనసభ నియోజకవర్గం లోని హనుమాజీపేట రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ల ప్రారంభోత్సవం చేయడం జరిగింది.
ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ల ప్రారంభోత్సవానికి గాను జిల్లా రైతు వేదిక చంద్రంపేట నుండి అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్( Collector Kheemya Naik ) ముఖ్య అతిధి గా పాల్గొనడం జరిగింది.
తదుపరి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతి మంగళ, శుక్ర వారాములలో రైతు వేదికలలో నిర్వహించే శిక్షణ కార్యక్రమాలని సద్వినియోగం చేసుకుని పంటల్లో అధిక దిగుబడులు పొందాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమానికి రైతుల తో పాటు నోడల్ అధికారి ఐన జిల్లా పరిషత్ సి .
ఉమా రాణి, జిల్లా మత్స్యశాఖ అధికారి శివ ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి వి.
భాస్కర్ తో పాటు సిరిసిల్ల డివిజిన్ వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు పాల్గొనడం జరిగింది.
అదే విధంగా హనుమాజీపేట రైతు వేదిక నుండి ఈ కార్యక్రమానికి నోడల్ అధికారి ఐన జిల్లా పరిషత్ డి వై .
ఓ .గీత, మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి శ్రీనివాస్ , మండల పశు సంవర్ధక శాఖ అధికారి, వేములవాడ డివిజిన్ వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు మరియు రైతులు పాల్గొనడం జరిగింది.
నేడే అల్లు అర్జున్ కేసు తుది తీర్పు.. తిరుమలకు చేరుకున్న భార్య స్నేహరెడ్డి!