ఏపీ జ్యుడీషియల్ అకాడమీ ప్రారంభం.. సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు

ఏపీ జ్యూడీషియల్ అకాడమీ ప్రారంభమైంది.గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఖాజాలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఈ అకాడమీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ సాంకేతికతను అందిపుచ్చుకునేలా డిజిటలైజేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టామన్నారు.

న్యాయవ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం వాడకం పెరిగిందన్న ఆయన కేసుల సత్వర పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుందన్నారు.

న్యాయస్థానాలు వివాదాల పరిష్కారమే కాదు.న్యాయాన్నినిలబెట్టేలా చూడాలని చెప్పారు.

కేసుల పరిష్కారంలో జాప్యాన్ని తగ్గించాలని తెలిపారు.న్యాయవ్యవస్థలో కేసుల సంఖ్య కంటే తీర్పుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని సీజేఐ స్పష్టం చేశారు.

చిట్లిన జుట్టును రిపేర్ చేసే సూపర్ టిప్స్ మీకోసం!