మార్చి నెలలో చెన్నైలో టిటిడి రెండవ దేవాలయ ప్రారంభోత్సవం..
TeluguStop.com
మన భారతదేశంలో ఎన్నో పురాతన దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.ఈ పుణ్యక్షేత్రాలకు ప్రతి రోజు ఎంతో మంది భక్తులు తరలివచ్చి భగవంతున్ని దర్శించుకుంటూ ఉంటారు.
అంతేకాకుండా మరికొంతమంది భక్తులు పూజలు అభిషేకాలు జరిపిస్తూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam) ప్రపంచంలోనే అతిపెద్ద ధనిక హిందూ దేవాలయం అని దాదాపు చాలామందికి తెలుసు.
చెన్నైలో(Chennai) టీటీడీ రెండో దేవాలయం మార్చి 17వ తేదీ నుంచి ప్రారంభానికి సిద్ధంగా ఉంది.
పద్మావతి అమ్మవారికి అంకితం చేసిన ఈ కొత్త దేవాలయాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం.
చెన్నైలోని టీటీడీ రెండో దేవాలయాన్ని మార్చి 17న భక్తులకు పూజల కోసం అంకితం చేయనున్నారు.
ఈ దేవాలయం చెన్నైలో టీ నగర్ లో ఉంది.చెన్నై టీ నగర్ లోని జిఎన్ చెట్టి రోడ్డులో స్థాపించబడిన తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన రెండో దేవాలయం.
ఇది టీ నగర్ వద్ద వెంకటనారాయణ రోడ్డులో ఉన్న మొదటి టీటీడీకి దగ్గరలో ఉంది.
"""/" /
అయితే ఈ ఆలయంలో ఆదివారం నుంచి పూజలు మొదలవుతాయి.ఈ మేరకు జిఎన్‌చెట్టి రోడ్(GNCHETTI) లోని కొత్త టీటీడీ దేవాలయంలో అంకురార్పణంతో మొదలయ్యే ధార్మిక ఆచారాల పరంపరను ఆదివారం నుంచి నిర్వహించనున్నట్లు టిటిడిఎస్ చెన్నై స్థానిక సలహా కమిటీ అధ్యక్షుడు టిటిడి ట్రస్ట్ కు ప్రత్యేక ఆహ్వానితులు ఏజే శేఖర్ రెడ్డి(AJ Shekhar Reddy) విలేకరులకు వెల్లడించారు.
ఈ పూజలో అతి ముఖ్య ఘట్టమైనా మహాకుంభాబిషేకం మార్చి 17న జరగనుంది.మార్చి 17న టీ నగర్ లోని జీఎన్ చెట్టి రోడ్డులో ఉన్న పద్మావతి అమ్మవారి ఆలయంలో జరిగే మహాకుంబాభిషేకానికి భక్తులు భారీగా తరలి రావాలని చెన్నై ఎల్ఏసి ప్రెసిడెంట్ భక్తులకు పిలుపునిచ్చారు.
నిర్మాణానికి అయిన ఖర్చులో దాదాపు కోటి రూపాయల నిధులను ఏజే శేఖర్ రెడ్డి డొనేట్ చేసినట్లు సమాచారం.
రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీయార్ వీళ్లలో టాప్ హీరో అతనేనా..?