విజయవాడలో రూ. 76 లక్షలు హవాలా నగదు స్వాధీనం

విజయవాడ భవానిపురం కోళ్ల ఫారం రోడ్డులో ఓ ఇంట్లో హవాల నగదు ను భవాని పురం పోలీసులు పట్టుకున్నారు.

సుమారు రూ.76 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

డబ్బును తరలిస్తున్న సదరు వ్యక్తులు డబ్బుకు సంబంధించి సరైన సమాధానం, పూర్తి వివరాలు చెప్పకపోవడంతో పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకున్నారు.

అలాగే నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు.