ఈ 450 ఏళ్ల గుడిలో ఒక్క అభిషేకం చేస్తే చాలు.. మీ బాధలన్నీ దూరం..!
TeluguStop.com
యమధర్మరాజు ఆస్థానంలో చిట్టాలు రాసే చిత్రగుప్తుడు గురించి మనందరికీ తెలుగు సినిమాల ద్వారా తెలిసిందే.
అయితే అలాంటి చిత్రగుప్తుడి ఆలయం ఉంటుందని చాలామందికి తెలిసి ఉండదు.శ్రీరాముడు( Lord Rama ) అయోధ్యలో చిత్రగుప్తుడికి ఆలయం కట్టించి పూజించినట్లు పురాణాల్లో కూడా ఉంది.
ఇప్పుడు ధర్మ హరి చిత్రగుప్త దేవాలయం( ChitraGupta Temple )గా వర్ధిల్లుతుంది.మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్, రామ్‌ఘాట్, ఉజ్జయిని ప్రాంతాల్లో చిత్రగుప్తుడి ఆలయాలు ఉన్నాయి.
ఇక సౌత్ ఇండియాలో చిత్రగుప్తుడికి కేవలం రెండే రెండు ఆలయాలు ఉన్నాయి.అందులో ఒకటి తమిళనాడు కంచిలో ఉంది.
"""/" /
ఇక మరొకటి మన రాష్ట్రంలో హైదరాబాద్లో ఉంది.ఫలక్నామాలోని కందికల్ గేట్ దగ్గర చిత్రగుప్త ఆలయం ఉంది.
250 ఏళ్ల చరిత్ర ఈ ఆలయానికి ఉందంటే నమ్మక తప్పదు.పాతబస్తీలోని ఉప్పుగూడ రైల్వే స్టేషన్( Uppuguda Railway Station ) సమీపంలో ఉన్న ఈ చిత్రగుప్తాలయం మూడున్నర ఎకరాల్లో విస్తరించి ఉంది.
అయితే భూలోకానికి అప్పుడప్పుడు చిత్రగుప్తుడు వస్తాడని, ఆయన కోసం ఈ దేవాలయం నివాసం అని అక్కడ స్థానికులు చెబుతారు.
ఈ ఆలయంలో చిత్రగుప్తుని భార్యలు నందిని, శోభవతి విగ్రహాలను కూడా ప్రతిష్టించారు. """/" /
అయితే కాయస్థ వంశీయులు కేతు గ్రహానికి గురువుగా భావించే చిత్రగుప్తుని పూజించడం వలన దోష నివారణ జరుగుతుందని ఒక నమ్మకం.
అయితే కాలక్రమేనా వంశస్థులు అంతరించిపోవడం వలన ఈ ఆలయం నిరాదరణకు గురైన మళ్లీ వెలుగులోకి రావడంతో వివిధ రాష్ట్రాల నుండి భక్తులు ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ఎందుకంటే ఈ ఆలయంలో చిత్రగుప్తుడికి అభిషేకం చేస్తే జీవితంలో ఉన్న ఎలాంటి సమస్యలైనా తీరిపోతాయి.
అందుకే భక్తులు వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఈ ఆలయంలో అభిషేకం చేస్తుంటారు.
ఇలా చేయడం వలన జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి, సుఖ సంతోషాలు వెళ్లి విరుస్తాయి.
అన్ స్టాపబుల్ షోలో చరణ్ వేసుకున్న టీ షర్ట్ ధర ఎంతో తెలుసా… దిమ్మతిరిగి పోవాల్సిందే!