మునుగోడు ఉపఎన్నిక బరిలో బీఆర్ఎస్

నల్గొండ జిల్లా మునుగోడు ఉపఎన్నిక బరిలో బీఆర్ఎస్ పోటీకి దిగనుంది.ఈ క్రమంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

జాతీయ పార్టీ పేరుతో పోటీ చేస్తామన్నారు.టీఆర్ఎస్ పేరు ఒక్కటే మారుతుందని తెలిపారు.

కొత్త పార్టీ అంటే సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో.పేరు ఒక్కటే మార్చుతున్నామన్నారు.

పార్టీ జెండా, గుర్తు మాత్రం అవే ఉంటాయని తెలుస్తుంది.దసరా పండుగ రోజున కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించనున్న సంగతి తెలిసిందే.

అయితే, ఈ సారి మునుగోడు బరిలో మూడు జాతీయ పార్టీలు ఉంటాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అదేవిధంగా అక్కడ అన్ని వర్గాలు, అన్ని సర్వేలు తమకే అనుకూలంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.