కార్తిక మాసంలో శివుని అనుగ్రహం.. ఈ రాశుల వారిపై ఉంటుందా..?

జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం కార్తీక మాసంలో ఈ రాశుల వారి పై శివుడి అనుగ్రహం ఉంటుందని పండితులు చెబుతున్నారు.

మరి ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ పౌర్ణమి సమయంలో ప్రజలు శివుడిని పూజిస్తూ ఉంటారు.

ఏడాది మొత్తం దేవుడికి పూజలు చేయకపోయినా ఈ ఒక్కరోజు దేవుడికి పూజ చేసి వత్తులు వెలిగించడం వల్ల ఏడాది మొత్తం పూజ చేసిన పుణ్యం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.

అయితే ఈ కార్తిక మాసంలో ఈ రాశుల వారిపై శివుడి అనుగ్రహం ఉంటుంది.

మరి ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే మేష రాశి( Aries ) వారిపై శివుని అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది.

"""/" / వారు జీవితంలో ఇబ్బందులలో ఉన్న ప్రతి సారి శివుడు స్వయంగా ఆ ఇబ్బందులను పరిష్కరిస్తాడు.

అందుకే ఈ రాశి వారు ఎక్కువగా సంతోషంగా ఉంటారు.శివుని అనుగ్రహం శాశ్వతంగా ఉండడానికి ఈ కార్తీక మాసంలో గంగానది నుంచి పవిత్ర జలాన్ని ఉపయోగించి శివలింగానికి అభిషేకం చేయాలి.

ఇంకా చెప్పాలంటే శివునికి ఇష్టమైన రాశి చక్రాలలో మకర రాశి( Capricorn ) ఒకటి అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

మకర రాశిలో జన్మించిన వ్యక్తులు ఎల్లప్పుడూ శివుని అనుగ్రహాన్ని పొంది ఉంటారు.మకర రాశిని పాలించే శని భక్తి పూజల ద్వారా శివుడిని ప్రసన్నం చేసుకోవచ్చు.

శనిచే పాలించే ఈ రాశి పై శివుడు తన ఆశీర్వాదాలను ప్రసాదిస్తాడు. """/" / మకర రాశికి చెందిన వారు శివునికి నీటిలో శమీ ఆకులను సమర్పించాలి.

శివ చాలీసా పఠించడం ఓం నమశ్శివాయ మంత్రాన్ని( Om Namashivaya Mantra ) పఠించడం వల్ల కూడా మంచి జరుగుతుంది.

ఇంకా చెప్పాలంటే కుంభ రాశిని శని పాలిస్తున్నాడు.శివునికి ఇష్టమైన రాశులలో కుంభరాశి కూడా ఒకటి.

కుంభ రాశి( Aquarius )కి చెందిన వారు పరమశివుడిని నిజమైన భక్తితో పూజించినప్పుడు శివుడు వారి పట్ల సంతోషంగా ఉంటాడు.

శివుడి దయా, మహిమా కుంభరాశి వ్యక్తుల జీవితాలకూ సంతోషం, శ్రేయస్సును తెలుస్తుంది.ఈ రాశి వారు కార్తీక మాసం సమయంలో శివునికి రుద్రాభిషేకం చేసి శివలింగానికి చెరుకు రసాన్ని సమర్పించడం మంచిదని పండితులు చెబుతున్నారు.

ఎమ్మెల్యే ఎంపీలకూ పార్టీ పదవులు ? టి.పిసిసి అధ్యక్షుడి నిర్ణయం