Srileela : అంతలోనే పొగరు బయట పెట్టేసిన శ్రీలీల.. కోట్లు ఇస్తానన్న కూడా ఆ స్టార్ హీరోను రిజెక్ట్ చేసిందిగా?

కొంతమంది హీరోయిన్స్ అతి తక్కువ సమయంలో హోదా రావటంతో అంతలోనే ప్లేట్ తిప్పేస్తూ ఉంటారు.

పారితోషకం విషయంలో కూడా బాగా డిమాండ్ చేస్తూ ఉంటారు.అంతేకాదు కొన్ని కొన్ని సార్లు స్టార్ హీరోలను కూడా లెక్క చేయలేకపోతుంటారు.

అయితే ఈ తీరు ఇప్పుడు శ్రీలీలలో కూడా కనిపిస్తుంది అని కొందరు అనుమానం పడుతున్నారు.

ఇంతకు అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.ధమాకా సినిమా తర్వాత నుంచి శ్రీలీల( Srileela ) క్రేజ్ బాగా పెరిగిపోయింది.

దర్శకనిర్మాతలు, హీరోలు కూడా ఈ ముద్దుగుమ్మనే ఎంచుకుంటున్నారు.ఎంతమంది స్టార్ హీరోయిన్స్ ఉన్నా కూడా ఈ కుర్ర హీరోయిన్ పై బాగా మనసు పాడేసుకుంటున్నారు.

శ్రీ లీల కూడా ఏ హీరో అని కూడా చూడకుండా వచ్చిన అవకాశాలన్నీ సైన్ చేస్తూ పోతుంది.

ఇప్పటికే ఈ అమ్మడు వరుస సినిమాల్లో బిజీగా ఉంది.తొలిసారిగా ముద్దు అనే కన్నడ ( Kannada )సినిమాతో అడుగు పెట్టింది.

ఆ తర్వాత టాలీవుడ్ కు 2021 లో పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది.

ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారింది.

ఇందులో తన పర్ఫామెన్స్ తో బాగా ఫిదా చేస్తుంది.ముఖ్యంగా తన అందాలతో అందరిని తన వైపుకు మలుపుకుంది.

ఇక గత ఏడాది మాస్ మహారాజ్ రవితేజ( Mass Maharaj Ravi Teja ) నటించిన ధమాకా( Dhamaka ) సినిమాలో హీరోయిన్ గా నటించగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకోవడంతో శ్రీలీల క్రేజ్ మరింత పెరిగిపోయింది.

దీంతో ఈ బ్యూటీపై తెలుగు దర్శకనిర్మాతలు కన్ను వేశారు.అప్పటికే పలువురు దర్శకులు ఈమెతో రెండు మూడు సినిమాలు ఫిక్స్ చేశారు.

ప్రస్తుతం అవి షూటింగ్ బిజీలో ఉన్నట్లు తెలుస్తుంది. """/" / ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను, సినిమా అప్డేట్లను పంచుకుంటూ ఉంటుంది.

ఇదంతా పక్కన పెడితే తాజాగా తను మరో సినిమాకు ఓకే చేసినట్లు కనిపించింది.

ఇక ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను తన ఇన్ స్టా లో పంచుకుంది.

అయితే ఇప్పటికే శ్రీలీల బాలయ్య, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, నితిన్ వంటి స్టార్ హీరోల సినిమాలలో బిజీగా ఉంది.

"""/" / రీసెంట్ గా విజయ్ దేవరకొండతో( Vijay Deverakonda ) కూడా జతకట్టింది.

ఇక వైష్ణవ్ తేజ్ తో కూడా ఒక సినిమా చేస్తుంది.అయితే ఇదంతా పక్కన పెడితే ఈ బ్యూటీ పై జనాలు ఫైర్ అవుతున్నారు.

కారణం తనలో ఉన్న పొగరు అని తెలిసింది.ఇంతకు అసలు విషయం ఏంటంటే.

రీసెంట్ గా శ్రీలీలకు ఐదు కోట్లు ఇస్తామని ఆఫర్ రావటంతో వెంటనే రిజెక్ట్ చేసిందట.

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్( Vishal ) తను నటించబోయే సినిమాకు హీరోయిన్ గా శ్రీ లీలను ఎంచుకున్నారట.

అంతేకాకుండా ఐదు కోట్లు రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధపడ్డారట.కానీ శ్రీలీల ఆ ఆఫర్ రిజెక్ట్ చేసిందని తెలిసింది.

దీంతో ఆమె విశాల్ సినిమా రిజెక్ట్ చేయటంతో కోలీవుడ్ ప్రేక్షకులు ఆమెకు అంత పొగరు ఉండదు అంటూ బాగా విమర్శలు చేస్తున్నారు.