అమ్మాయిలు రెచ్చిపోయి డ్యాన్స్ చేస్తుంటే అడ్డుకోవడానికి వచ్చిన హాస్టల్ వార్డెన్.. చివరికి?
TeluguStop.com
న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు డ్యాన్సులు, పార్టీలు, వంటకాలతో ప్రపంచమంతా సందడి నెలకొంటుంది.
మన ఇండియాలో కూడా కాలేజీ స్టూడెంట్స్, హాస్టల్ పిల్లలు( College Students, Hostel Kids ) అయితే ఇక చెప్పక్కర్లేదు.
ఫుల్లు జోష్‌లో డ్యాన్సులు, అదిరిపోయే ఫుడ్‌తో రచ్చ చేస్తారు.కానీ కొన్నిసార్లు టీచర్లు, వార్డెన్లు వచ్చి డిసిప్లిన్ పేరుతో వీళ్ల హడావిడికి బ్రేకులు వేస్తుంటారు.
అయితే, రీసెంట్‌గా ఒక వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో అమ్మాయిలు న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌లో( New Year Celebrations ) ఓ బాలీవుడ్ పాటకు డ్యాన్సులు చేస్తూంటే, ఇంతలో వార్డెన్ ఎంట్రీ ఇచ్చింది.
అంతే.ఒక్కసారిగా అందరూ హడలిపోయారు.
ఏం జరుగుతుందో అని అనుకున్నారు.కానీ అసలు మ్యాటరే వేరు.
"""/" /
వార్డెన్ ( Warden )వాళ్లని ఆపడానికి రాలేదు.ఆ అమ్మాయిల ఎనర్జీకి ఫిదా అయిపోయిందో ఏమో.
కాసేపు అలా చూసి నవ్వేస్తూ వాళ్లతో కలిసి స్టెప్పులేసింది.అవును నిజం, వార్డెన్ కూడా డ్యాన్స్ ఫ్లోర్‌లో యువతులతో కలిసి మస్తు ఎంజాయ్ చేశారు.
అబ్బో.ఆ సీన్ అయితే నిజంగా అదిరిపోయింది కదా.
నిజానికి ఆమెని డాన్స్ చేయొద్దు అనుకుంది కానీ స్టూడెంట్స్ తమ డ్యాన్స్ లో క్యామిని లాగేసుకున్నారు.
అంతే ఆ లేడీ వార్డెన్ అదిరిపోయే స్టెప్పులతో మంటలు పుట్టించింది. """/" /
ఇంకేముంది.
ఈ వీడియో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.చాలామంది ఈ వీడియో చూసి రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
ఒక యూజర్ అయితే "మా వార్డెన్ అయితే దీనికి పూర్తి వ్యతిరేకం.పాట ఆపేసి, అమ్మాయిల్ని బాయ్స్ హాస్టల్‌కి తీసుకెళ్లి మరీ అవమానించేది" అని కామెంట్ పెట్టారు.
ఇంకొకరు మాత్రం "మాకు కూడా ఇలాంటి వార్డెన్ ఉంటే ఎంత బాగుంటుందో" అని విష్ చేశారు.
ఏది ఏమైనా, ఈ వీడియో మాత్రం ఒక చిన్న పాజిటివ్ వైబ్ ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో చూపిస్తోంది.
కఠినమైన రూల్స్ ఉండే చోట కూడా ఇలాంటి సరదా మూమెంట్స్ క్రియేట్ అయితే ఆ కిక్కే వేరు కదా.
వీడే అసలైన జీనియస్.. పని చేయకుండానే కోట్లు సంపాదిస్తున్నాడు.. ఎలాగో తెలుసా?