భాష రాని భారతీయుల విషయంలో...కువైట్ లో ఎంబసీ కీలక నిర్ణయం...!!

ఉన్న ఊరు విడిచి దేశం కాని దేశం పొట్ట చేత బట్టుకుని ఎంతో మంది ఇతర దేశాలకు వలసలు వెళ్తూ ఉంటారు.

ముఖ్యంగా భారత్ నుంచీ అరబ్ దేశాలకు వలస కార్మికులుగా వెళ్ళే వారి సంఖ్య అత్యధికంగా ఉంటుంది.

అలా వలసలు వెళ్ళే వారు అక్కడ తాము అనుకున్న ఉద్యోగాలలో చేరినా కొందరు ఉద్యోగాల విషయంలో మోసపోతూ ఉంటారు.

మరి కొందరు ఉద్యోగాలో చేరినా జీత భత్యాల విషయంలో మోస పోతూ ఉంటారు.

ఇంకొంత మంది యజమానులు తమ వద్ద పనిచేసే వలస కార్మికులను నిర్భంధించి పాస్ పోర్టులు లాగేసుకుని ఇబ్బందుల పాలు చేస్తూఉంటారు.

అయితే దేశం కాని దేశంలో తమ గోడు వెళ్ళ బోసుకోవాలన్నా, తమకు వీసాల విషయంలో ఉత్పన్నమయ్యే సమస్యలను వివరించాలన్నా ఎంతో మంది భారతీయులకు అక్కడి స్థానిక అరబ్బు బాష పై పట్టు లేకపోవడం ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తోంది.

ఇక అక్కడి లేబర్ ఆఫీస్ లో భారతీయులకు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది ఆ సమయంలో భారతీయులు అక్కడి బాష రాకపోవడంతో సిబ్బందితో తమ సమస్యలు చెప్పుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు.

ఈ పరిస్థితులను గుర్తించిన ఇండియన్ ఎంబసీ భారతీయులు ఇకపై ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది భారత రాయబార కార్యాలయం నుంచీ భారతీయ బాషలు అలాగే అరబ్ మాట్లాడే సిబ్బందిని డొమెస్టిక్ లేబర్ ఆఫీస్ (DLO ) లో భారతీయులకు అందుబాటులో ఉంచేందుకు ప్రణాలికలు సిద్దం చేసింది.

అరబిక్ మాట్లాడుతూ భారతీయ బాశాలపై పట్టు ఉన్న భారత రాయబార సిబ్బందిని డొమెస్టిక్ లేబర్ ఆఫీస్ (DLO ) వద్ద ఉదయం 8 గంటల నుంచీ మధ్యాహ్నం 1:00 వరకూ భారత పౌరులకు అందుబాటులో ఉండేలా వారి సమయాన్ని వృదా అవనివ్వకుండా ఉంటుందని భారత ఎంబసీ పేర్కొంది.

అంతేకాదు తమ సిబ్బందిని వాట్సప్ నెంబర్ +965 - 65501769 ద్వారా కూడా సంప్రదించవచ్చునని తెలిపింది.

వైరల్: వామ్మో.. ఈ మంచం ఏంటి ఇంత పెద్దగా ఉంది..