హత్య కేసులో ఒక నిందుతుని జీవిత ఖైదు, ఒక నిందుతుని 10 సంవత్సరాల జైలు శిక్ష

రాజన్న సిరిసిల్ల జిల్లా :​​వ్యక్తి హత్యకు కారణమైన ఇద్దరు నింధితులలో ఒకరికి జీవిత ఖైదు, 2500 రూపాయల జరిమానా, మరొ వ్యక్తికి 10 సంవత్సరాల జైలు శిక్ష, 2500 రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత బుధవారం రోజున తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

​వివరాల మేరకు.ముస్తాబాద్ గ్రామాని( Mustabad )కి చెందిన పండుగ రాజం S/o రాములు అనే వ్యక్తికి తన అక్క అయిన పండుగ మరియమ్మ కి ఆస్తుల పంపకాల గురించి గొడవలు జరుగుతుండేవి ఇట్టి క్రమం లో తేది 01-09-2020 రోజున పండుగ మరియమ్మ, ఆమె కుమారుడైన పండుగ మల్లేశం లు పండుగ రాజం ను చంపాలనే ఉద్దేశంతో గొడ్డలితో నరికి చంపినారు.

ఈ సంఘటనపై అప్పటి సిరిసిల్ల రూరల్ సిఐ సర్వర్ కేసు నమోదు చేసి పండుగ మరియమ్మ, పండుగ మల్లేశం ను రిమాండ్ కు తరలించి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.

కోర్టు మానిటరింగ్ ఎస్ ఐ రవీంద్రనాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ నవీన్, దేవేందర్, సీఎంఎస్ కానిస్టేబుల్ నరేందర్ లు కోర్టులో 15 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ నర్సింగరావు వాదించారు కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందుతురాలు పండుగ మరియమ్మ కి పది సంవత్సరాల జైలు శిక్ష తో పాటు 2500 రూపాయల జరిమానా, మరొక నింధితుడైన పండుగ మల్లేశం కు జీవిత ఖైదు జైలు శిక్ష తో , 2500 రూపాయల జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని,శిక్షలతోనే సమాజంలో మార్పు వస్తుందని, పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ, న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు.

పైకేసులో నిందితులకి శిక్ష పడటం లో కృషి చేసిన పీపీ నర్సింగారావు కోర్టు కానిస్టేబుల్ నవీన్, దేవేందర్, సిఎంఎస్ కానిస్టేబుల్ నరేందర్ లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

వీడియో: పట్టపగలే దారుణం.. నర్సింగ్ విద్యార్థిని గొంతు నులిమి చంపబోయిన ప్రేమోన్మాది..