ఆ జంతువుల అనాథాశ్రమంలో.. పులులు ప్రేమ‌గా య‌జ‌మానిని కావ‌లించుకుంటాయి

డాక్టర్ ప్రకాష్ మహారాష్ట్రకు చెందిన ప్ర‌ముఖ‌ సామాజిక కార్యకర్త బాబా ఆమ్టే కుమారుడు.

అత‌నికి జంతువులు మరియు పక్షుల కోసం అనాథ ఆశ్రమాన్ని నిర్మించాలనే ఆలోచన వ‌చ్చింది.

హేమల్కసలో జరిగిన ఒక సంఘటనతో పశువుల కోసం అనాథాశ్రమాన్ని తెరవాల‌ని అనుకున్నాడు.ఒకసారి అతను అడవి గుండా వెళుతుండగా, కొందరు పోకిరీలు కోతులను తాళ్ల‌తో కట్టి తీసుకెళ్తున్నారు.

వాటిని త‌న‌కు అప్పగిస్తే గ్రామంలోనే ఉంటూ జీవితాంతం సేవ చేస్తామని డాక్టర్ ప్రకాష్ ఆమ్టే అక్క‌డివారికి హామీ ఇచ్చారు.

ఆమ్టే దంపతుల మాటకు గ్రామస్తులు అంగీకరించారు.అడవి జంతువుల పిల్లల కోసం తమ‌ ఇంట్లో అనాథ శరణాలయాన్ని నిర్మించారు.

ప్రస్తుతం ఈ అనాథాశ్రమంలో ఎలుగుబంట్లు, చిరుతపులులు, జింకలు, మొసళ్లు సహా 90కి పైగా జంతువులు ఉన్నాయి.

వాటిలో నెమళ్లు, విషసర్పాలు కూడా ఉన్నాయి.డాక్టర్ ఆమ్టే కుటుంబంతో పాటు, జంతువులన్నీ కూడా తమలో తాము కుటుంబంలా జీవిస్తాయి.

క్రూరమైన జంతువులన్నీ ఆమ్టే దంపతులను తమ సంరక్షకులుగా భావిస్తాయి.చంద్రాపూర్‌కు 150 కి.

మీ దూరంలో ఉన్న ఆమ్టే దంపతులు నివసించే ప్రాంతం నక్సలిజం బారిన పడింది.

అత‌ని తండ్రి బాబా ఆమ్టే ఇక్కడ లోక్ బిరాదారీ ప్రాజెక్టును నెల‌కొల్పారు.అతని మరణం తరువాత, డాక్టర్ ప్రకాష్, అత‌ని భార్య మందాకిని ఇంటి బాధ్యతలను తీసుకున్నారు.

ఇక్కడ గిరిజనులకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తున్నారు. """/"/ ఇక్కడ చదివిన చాలా మంది విద్యార్థులు ప్రభుత్వ అధికారులు, పోలీసులు అయ్యారు.

ఎంతో మంది విద్యార్థులు ఈ ప్రాంత అభ్యున్నతికి కృషి చేస్తున్నారు.వైద్య విద్యను పూర్తి చేసిన డాక్టర్ ప్రకాష్ ఆమ్టే, అతని భార్య డాక్టర్ మందాకిని ఆమ్టే విలాసవంతమైన జీవితాన్ని వ‌దిలి గిరిజనుల అభ్యున్నతికి పాటుపడుతున్నారు.

ఈ సింపుల్ రెమెడీతో మీ ఐబ్రోస్ దట్టంగా మారడం గ్యారెంటీ!