ఆ విషయంలో కెసిఆర్ ముందడుగు.. జగన్ వెనకడుగు
TeluguStop.com
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంచి మిత్రులు అన్న సంగతి తెలిసిందే.ఏపీ తెలంగాణకు సంబంధించి అనేక అంశాలపై పోలిక ఉన్నా, అనేక వివాదాలు నెలకొన్నా, అటు తెలంగాణ సీఎం కేసీఆర్( CM Kcr ), ఇటు ఏపీ సీఎం జగన్ సానుకూలంగానే చర్చించుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు.
పెద్దగా రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు లేవు.ఇద్దరు సొంతంగానే పార్టీని స్థాపించి అధికారంలోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతోపాటు, రెండుసార్లు హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్న కేసీఆర్ మూడోసారి విజయం సాధించాలనే పట్టుదలతో ఉండగా, వచ్చే ఏడాది జరగనున్న ఏపీ ఎన్నికల్లోను జగన్ ( CM Jagan )అదేవిధంగా హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు.
వ్యక్తిగతంగా చూస్తే జగన్ కు కేసిఆర్ కు చాలా విషయాల్లో పోలికే ఉంటుంది.
ఇద్దరు మొండివాళ్లగానే పేరు పొందరు. తమ పార్టీ ఎమ్మెల్యేలు , ఎంపీలు , మంత్రులు ఇలా ఎవరైనా అరుదుగా మాత్రమే వారికి అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు.
పెద్దగా ఎవరిని కలిసేందుకు కానీ , జనాల్లో తిరిగేందుకు కానీ అంతగా ఆసక్తి చూపించరు.
"""/" /
ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో రెండు పార్టీల నేతలు జనాల బాట పడుతున్నారు.
ఈ విషయంలో కెసిఆర్ మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు.151 సీట్ల తో అధికారంలోకి వచ్చిన జగన్ అషామాషి గా అయితే సీఎం కుర్చీలో కూర్చోలేదు.
ఆ కుర్చీలో కూర్చునేందుకు చాలా కసరత్తే చేశారు.అనుకున్నట్టుగానే ఎన్నికల్లో విజయం సాధించి సక్సెస్ అయ్యారు.
ఇదంతా ఆయన నిరంతరం జనాల్లో ఉండడంతోనే సాధ్యమైంది .అయితే అధికారం దక్కిన తర్వాత జగన్ ఎక్కువగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి పరిమితం అయిపోతున్నారు.
ఈ విషయంలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి.
రెండుసార్లు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూసిన జనాలు , మూడోసారి మళ్లీ అదే పార్టీకి పట్టం కట్టాలంటే చాలా వ్యూహాలే అమలు చేయాలి.
"""/" /
పూర్తిగా సంక్షేమ పథకాలని నమ్ముకుంటే అది సాధ్యం కాదని గుర్తించిన కేసీఆర్ ,( CM Kcr ) ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని తెలిసినా, సంక్షేమ పథకాలు పార్టీ నాయకులకి ఎక్కువ మేలు చేశాయనే ఆరోపణలు ఉన్నా కొంతమంది మినహా దాదాపుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టిక్కెట్లు ఖరారు చేశారు .
గత ఎన్నికల్లోను ఇదే ఫార్ములాను కేసీఆర్ అవలంబించారు .ప్రభుత్వంతో పాటు.
వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని తెలిసినా, సిట్టింగులకు సీట్లు ఇచ్చి సాహసోపేతమైన నిర్ణయం కేసీఆర్ తీసుకున్నారు.
ఎమ్మెల్యే అభ్యర్థుల తరఫున కేసీఆర్ స్వయంగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తూ, తనను తన పాలనను చూసి ఓట్లు వేయాల్సిందిగా ప్రజలను కోరుతున్నారు.
ఈ విషయంలో వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) కెసిఆర్ స్థాయిలో సాహస నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అనే చెప్పాలి.
ఇప్పటికే అనేకసార్లు నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశాల్లో దాదాపు 30 నుంచి 40 మందికి సీట్లు దక్కి అవకాశాలు లేవని, సర్వేల్లో సానుకూలత లేని కారణంగానే సీట్లు నిరాకరిస్తున్నామని జగన్ ప్రకటించారు.
అలాగే కొంతమంది కీలక నాయకులకు టికెట్ ఇవ్వట్లేదనే సంకేతాలను పంపించారు.ఆ కారణం గా చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసీపీకి దూరమై రెబల్ గా మారి పార్టీకి నష్టం చేకూరుస్తున్నారు.
ఎమ్మెల్యేల పై వ్యతిరేకతో ఉందని తెలిసినా కేసీఆర్ సాహసోపేతంగా మళ్లీ వారికి టిక్కెట్లు ఇచ్చి , తనను తన సమర్ధతను చూసి ఓట్లు వేయాల్సిందిగా ప్రజలను పరోక్షంగా కోరుతుండగా, జగన్ మాత్రం కేసిఆర్ స్థాయిలో నిర్ణయం తీసుకునేందుకు సాహసం చేయలేకపోతున్నారు.
అమీర్ ఖాన్ కొత్త సినిమా వచ్చేది అప్పుడేనా..?మన హీరోలను చూసి భయపడుతున్నాడా..?