అక్క‌డ టీడీపీకి దారులు క‌న‌ప‌డ‌ట్లేదా… నేత‌లే క‌రువు ?

అక్క‌డ టీడీపీకి దారులు క‌న‌ప‌డ‌ట్లేదా… నేత‌లే క‌రువు ?

ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో రాజ‌కీయంగా చైత‌న్యం ఉన్న జిల్లా శ్రీకాకుళం.ఇక్క‌డి శ్రీకాకుళం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ప‌రిస్థితి ఏంటి? ఎవ‌రు ఇక్క‌డ పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపిస్తున్నారు? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీద‌కి వ‌చ్చాయి.

అక్క‌డ టీడీపీకి దారులు క‌న‌ప‌డ‌ట్లేదా… నేత‌లే క‌రువు ?

దీనికి కార‌ణం.ఇక్క‌డ నుంచి వ‌రుస విజ‌యాలు సాధించి.

అక్క‌డ టీడీపీకి దారులు క‌న‌ప‌డ‌ట్లేదా… నేత‌లే క‌రువు ?

ప్ర‌జ‌ల నాయ‌కులుగా పేరు తెచ్చుకున్న గుండా అప్ప‌ల సూర్య‌నారాయ‌ణ‌, ల‌క్ష్మీదేవి దంప‌తులే 1985 నుంచి టీడీపీకి ద‌శ దిశ అన్న‌ట్టుగా మారిపోయారు.

సూర్య‌నారాయ‌ణ 1985 నుంచి వ‌రుస‌గా 4 సార్లు విజ‌యం సాధించారు.ఇక‌, వైఎస్ పాద‌యాత్ర నేప‌థ్యంలో 2004, 2009లో ఇక్క‌డ పార్టీ ఓడిపోయింది.

ఇక‌, 2014 ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ టీడీపీ విజ‌యం సాధించింది.2014 ఎన్నిక‌ల్లో గుండా ల‌క్ష్మీదేవి విజ‌యం సాధించారు.

అయితే గ‌‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఆమెకే మ‌ళ్లీ చంద్ర‌బాబు టికెట్ ఇచ్చారు.వాస్త‌వానికి ఆమె వ‌ద్ద‌ని ఇక్క‌డి నాయ‌కులు పేర్కొన్నారు.

వ‌యో వృద్ధులు కావ‌డం, ప్ర‌జ‌ల్లో తిర‌గ‌లేక‌పోవ‌డం వంటివి కార‌ణాలుగా చూపించారు.అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు మాత్రం ల‌క్ష్మీదేవికే మొగ్గు చూపించారు.

శ్రీకాకుళానికి తుఫాను  వ‌చ్చిన స‌మ‌యంలో ల‌క్ష్మీదేవి యాక్టివ్‌గా ప‌నిచేశారు.వ‌య‌సు రీత్యా ఉన్న ఇబ్బందులు కూడా ప‌క్క‌న పెట్టి ఆమె ప్ర‌జ‌ల మ‌ధ్య ఉన్నారు.

దీంతో చంద్ర‌బాబు ఆమెకే మొగ్గు చూపారు. """/"/ అయితే.

గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ దూకుడు, జ‌గ‌న్ హ‌వా జోరుగా ఉండ‌డంతో ఆమె 5 వేల ఓట్ల‌తో ఓడిపోయారు.

ఇక‌, అప్ప‌టి నుంచి కూడా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు.మ‌రోవైపు ఇక్క‌డ నుంచి వైసీపీ త‌ర‌ఫున గెలిచిన మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు.

వైసీపీని బ‌లోపేతం చేసుకుంటున్నారు.ఈ నేప‌థ్యంలో చాలా వ‌ర‌కు టీడీపీ కేడ‌ర్ లోపాయికారీగా.

ధ‌ర్మాన‌కు మ‌ద్దతు ప‌లుకుతున్నారు.టీడీపీ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టేవారు కూడా ఇక్క‌డ క‌నిపించ‌డం లేదు.

మ‌రి ఇప్పుడు ఇక్క‌డ ప‌గ్గాలు ఎవ‌రికి ఇస్తారు? అనే ప్ర‌శ్న తెర‌మీద‌కి వ‌చ్చింది.

పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు కింజ‌రాపు అచ్చ‌న్నాయుడు ఈ జిల్లా కే చెందిన యాక్టివ్ నాయ‌కుడు కావ‌డంతో ఇప్ప‌టికే ఈ నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి పెట్టార‌ని జ‌న‌వరిలో కొత్త నాయ‌కుడిని ఎంచుకుని ప‌గ్గాలు అప్ప‌గిస్తార‌ని అంటున్నారు.

మ‌రి ఎవ‌రు వ‌స్తారు?  ధ‌ర్మాన‌ను ఢీ కొనే శ‌క్తి ఎవ‌రికి ఉంటుంద‌నే చ‌ర్చ స‌ర్వ‌త్రా జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

భారీ గిరినాగుతో దెబ్బకు బిత్తరపోయిన రైతులు.. వైరల్ వీడియో

భారీ గిరినాగుతో దెబ్బకు బిత్తరపోయిన రైతులు.. వైరల్ వీడియో