NTR : ఆ విషయం లో ఎన్టీయార్ తాతకు తగ్గ మనవడు అనిపించుకుంటాడా..?

సీనియర్ ఎన్టీఆర్( Sr NTR ) ఒకప్పుడు వరుస సినిమాలను చేస్తూ బాక్సాఫీస్ ను షేక్ చేశాడు.

ఎన్టీఆర్ చేసిన సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాయి.అయితే ఆయన చాలా మంది హీరోయిన్లతో నటించినప్పటికీ శ్రీదేవితో( Sridevi ) చేసిన సినిమాలు మాత్రం చాలా ప్రత్యేకంగా నిలిచాయనే చెప్పాలి.

ముందుగా కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'వేటగాడు ' అనే సినిమాతో ఎన్టీఆర్, శ్రీదేవిల జోడి మొదటిసారి వెండితెర మీద కనిపించింది.

"""/" / ఇక ఈ సినిమాతో ఆకట్టుకున్న వీళ్ళ జోడి వరుస సినిమాలతో ముందుకు సాగింది.

వేటగాడు సినిమా సూపర్ సక్సెస్ అవడంతో ఆ తర్వాత ఆటగాడు, సర్దార్ పాపారాయుడు, గజదొంగ, సత్యం శివం లాంటి పలు సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు.

ఇక నార్మల్ హీరోయిన్ గా ఉన్న శ్రీదేవి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేంజ్ లోకి వెళ్ళిపోయింది.

ఇక దాంతో శ్రీదేవి బాలీవుడ్ లో సైతం ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా స్టార్ హీరోయిన్ రేంజ్ ని కైవసం చేసుకుంది.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్రీదేవి కూతురు అయిన జాహ్నవి కపూర్, ( Jahnavi Kapoor ) జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర( Devara ) సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

"""/" / దాంతో జూనియర్ ఎన్టీఆర్ జాహ్నవి కి హిట్ ఇస్తాడా? లేదా అని విషయం మీద చాలా రకాల చర్చలైతే జరుగుతున్నాయి.

ఎందుకంటే ఒకప్పుడు ఎన్టీఆర్ వాళ్ళ తాత అయిన సీనియర్ ఎన్టీయార్ శ్రీదేవికి తెలుగు లో మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ని అందించాడు.

అదే రీతిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా జాహ్నవి కపూర్ కి మొదటి హిట్ ఇస్తాడా లేదా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఈ సంవత్సరం రిలీజ్ కి రెఢీ అవుతుంది.

చూడాలి మరి ఈ సినిమాతో జాహ్నవి కి మొదటి సక్సెస్ దక్కుతుందో లేదో.

నాన్ వెజ్ ఫెస్టివల్: ఆ జాతరకు కేవలం మగవారు మాత్రమే ఎంట్రీ.. ఆడ వాళ్లకు నో ఎంట్రీ..