ఆ విష‌యంలో జ‌గ‌న్‌, ప‌వ‌న్ కంటే స్పీడుగా ఉన్న చంద్ర‌బాబు.. క‌లిసొస్తుందా..?

కాలం మారిపోయింది.ట్రెండ్ మారుతోంది.

రాజ‌కీయాలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ఒక‌ప్ప‌టి రాజ‌కీయాల‌కు ఇప్ప‌టి రాజ‌కీయాల‌కు చాలా మార్ప‌లు వ‌చ్చేశాయి.

ఒక‌ప్పుడు ప్ర‌స్ మీట్ ఏదైనా విష‌యం చెప్పేవారు.కానీ ఇప్పుడు సోష‌ల్ మీడియా వ‌చ్చేసిన త‌ర్వాత మాత్రం ప్ర‌తి విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా చాలా మంది స్పందిస్తున్నారు.

ఇక ప్ర‌తి పార్టీకి సోష‌ల్ మీడియా సైనికులు కూడా ఉంటున్నారు.సోష‌ల్ మీడియా వింగ్‌లు చాలా యాక్టివ్ గా ఉంటూ.

ప్ర‌తి ప‌క్షాల‌పై చురుగ్గా కామెంట్లు చేస్తుండ‌టం కూడా చూస్తున్నాం.అయితే ఇలా సోష‌ల్ మీడ‌యాలో యాక్టివ్ గా ఉంటున్న నేత‌ల్లో చంద్ర‌బాబు అంద‌రికంటే ముందు వ‌రుస‌లో ఉన్నారండోయ్‌.

వినేందుకు కొంచెం ఆశ్చ‌ర్యంగా ఉన్నా కూడా ఇదే నిజం.ఏపీలో కీల‌క నేత‌లు అయిన జ‌గ‌న్‌, ప‌వ‌న్ కంటే కూడా చంద్ర‌బాబే ముందు వ‌రుస‌లో ఉన్నారంట‌.

విష‌యం ఏదైనా స‌రే వెంట‌నే ట్విట్ట‌ర్‌లో స్పందిస్తున్నారు చంద్ర‌బాబు.కాగా జ‌గ‌న్ సీఎం అయ్యాక కొంత దూకుడుగా క‌నిపించినా.

ఆ త‌ర్వాత మాత్రం స్పీడు త‌గ్గించేశారు.మ‌ళ్లీ చంద్ర‌బాబు స్పీడు పెంచుకుని ముందు వ‌రుస‌లో ఉంటున్నారు.

"""/" / అయితే ఇలా ఆయ‌న స్పీడుగా స్పందిస్తూ కొన్ని సార్లు వివాదాస్ప‌దం కూడా అవుతున్నారు.

ఆ మ‌ధ్య ఓ నేత విష‌యంలో ఇలాగే స్పందించారు.ఓ ఛానెల్ లో ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్టు వార్త రావ‌డంతో ఆగ‌మేఘాల మీద ట్విట్ట‌ర్‌లో పోస్టు పెట్టేశారు.

అయితే అదే ఛాన‌ల్ లో ఆయ‌న బాగానే ఉన్న‌ట్టు మ‌ళ్లీ వార్త రావ‌డంతో.

చంద్ర‌బాబు త‌న పోస్టును డిలీట్ చేశారు.ఇక స్వాతంత్య్ర దినోత్స‌వంతో పాటు.

ఇత‌ర కీల‌క ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో చంద్ర‌బాబు చాలా త్వ‌ర‌గా స్పందిస్తున్నారు.ఇక జ‌గ‌న్‌, ప‌వ‌న్‌లు నెమ్మ‌దిగా స్పందిస్తున్నారు.

మ‌రి బాబు వేగం ఆయ‌న‌కు ఆయ‌న ఏ స్థాయిలే మేలు చేస్తుందో చూడాలి.

మంత్రి పొంగులేటికీ, హీరో వెంకటేశ్‌కూ ఉన్న లింక్ ఇదే?