సింగరేణిలో ఈనెల 27న గుర్తింపు సంఘం ఎన్నికలు..
TeluguStop.com
తెలంగాణలో సింగరేణి ఎన్నికలకు ముహుర్తం ఖరారు అయింది.ఈ మేరకు ఈనెల 27న సింగరేణిలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు జరగనున్నాయి.
అదే రోజు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను కూడా నిర్వహించనున్నారు.అయితే ఈ ఎన్నికల్లో గుర్తింపు పొందేందుకు వివిధ పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.
ఇప్పటికే రెండు సార్లు బీఆర్ఎస్ గుర్తింపు సంఘంగా విజయం సాధించిన విషయం తెలిసిందే.
అయితే ఈసారి కాంగ్రెస్ విజయాన్ని కైవసం చేసుకోవాలని యోచిస్తోంది.గతంలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా అసెంబ్లీ ఎన్నికల కారణంగా సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదా పడ్డాయి.
ఈ మేరకు పెద్దపల్లి జిల్లాలో కోల్ బెల్ట్ ఎన్నికల సందడి ప్రారంభమైందని తెలుస్తోంది.
ప్రవాసీ భారతీయ దివస్ 2025 .. భువనేశ్వర్‌లో ఎన్ఆర్‌లకు భారీ స్వాగత ఏర్పాట్లు