వైరల్ వీడియో: రెప్పపాటులో రూ. 5 లక్షల విలువైన బంగారు నగల బ్యాగ్ చోరీ..
TeluguStop.com
ప్రస్తుత రోజులలో మనం ఒక్కోసారి ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా పక్కవారి నుంచి వచ్చే పరిమాణాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి.
అలాగే మనం బహిరంగ ప్రదేశాలలో ఉన్నప్పుడు మాత్రం మనం విలువైన వస్తువులతో ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి.
అంతేకాకుండా.మనం ఎంత జాగ్రత్తగా మన వస్తువులను పెట్టుకున్నా సరే ఒక్కోసారి దొంగల పాలు అవుతూ ఉంటాయి.
ఇక రోడ్లపై ప్రయాణించే సమయంలో మనం చాలా సార్లు ఫోన్ల దొంగతనాలు జరుగుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం.
అచ్చం అలాంటి సీను ఒకటే రోడ్డుపై ఉన్న స్కూటీలో( Scooty ) చాలా విలువైన ఆభరణాలను ఒక దొంగ( Thief ) చాకచక్యంగా దొంగతనం చేశాడు.
"""/" /
ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు కి వెళ్తే.పూణే నగరంలో( Pune ) పట్టపగలు నడిరోడ్డుపై ఒక దొంగ చాలా సులువుగా ఐదు లక్షలు విలువ చేసే బంగారు నగల బ్యాగును( Jewellery Bag ) కాజేశాడు.
ఈ సంఘటనకు సంబంధించిన ఘటన మొత్తం కూడా ఫుల్ సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అవ్వగా.
అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.పుణెకు చెందిన ఒక వృద్ధ దంపతులు బ్యాంకులో వారి బంగారు నగలను విడిపించుకొని మరి స్కూటీ మీద ఇంటికి వెళ్లే మార్గం మద్యంలో ఒక షాపు దగ్గర వడపావ్ కొనేందుకు భర్త దిగి షాప్ లోకి వెళ్ళాడు.
"""/" /
ఈ క్రమంలో భార్య స్కూటీ వద్దనే నిలబడి ఉంది.ఇది అంతా గమనిస్తున్న ఒక ఆకతాయి సరైన సమయంలో నగల బ్యాగు పట్టుకొని అక్కడి నుంచి పారిపోయాడు.
అప్పటికి ఆ మహిళ అతని పట్టుకునేందుకు ప్రయత్నం చేయగా.ఆలోపే ఆ దొంగ అక్కడి నుండి పరారు అయిపోయాడు.
ఇక ఈ వీడియోను చూసిన కొంతమంది నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.అంతటి విలువైన వస్తువులు ఉన్నప్పుడు కాస్త మరింత జాగ్రత్తగా ఉంటే బాగుండేది అంటూ కామెంట్స్ చేయగా.
మరికొందరు వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ డ్యాన్స్, డైలాగ్ డెలివరీకి నేను పెద్ద ఫ్యాన్.. వెంకటేశ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్!