1000 కోట్ల సాయం చేయండి పార్లమెంట్ లో వైసీపీ ఎంపీ సంచలన కామెంట్స్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాయలసీమ ప్రాంతంలో రైతులతో పాటు సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం తెలిసిందే.

ఎన్నడూ లేని విధంగా రాయలసీమ ప్రాంతంలో కురిసిన వర్షాలకు పంట పొలాలు.నీట మునిగిపోగా.

కొన్నిచోట్ల ప్రాజెక్టులు ,డ్యాములు ,రిజర్వాయర్లు డ్యామేజ్ అయ్యి, ఇల్లు నీటమునిగాయి.దీంతో చాలామంది ఇల్లు లేక నిరాశ్రయులయ్యారు.

ఇటువంటి తరుణంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటించి ఇల్లు లేని నిరాశ్రయులకు ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తుందని హామీ ఇవ్వడం జరిగింది.

పరిస్థితి ఇలా ఉంటే తాజాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో  రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యుడు భరత్.

ఏపీకి వరద సహాయం కింద తక్షణమే వెయ్యి కోట్లు రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

దాదాపూ లక్ష ఎకరాలకు పైగానే.పంట పొలాలు దెబ్బతిన్నాయని.

కేంద్ర సర్వే బృందం కూడా ఇదే చెప్పిందని దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు.

నష్టం వాటిల్లిందని అన్నారు.ఇదే తరుణంలో వరద సహాయ చర్యలలో ప్రభుత్వ పనితనం కూడా గొప్పగా ఉందని ప్రశంసించినట్లు చెప్పుకొచ్చారు.

ఏది ఏమైనా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన వరదల విషయంలో ఏర్పడిన నష్టానికి కేంద్రం ఆదుకోవాలని వెయ్యి కోట్లు తక్షణమే సాయం కింద రిలీజ్ చేయాలని ఎంపీ భరత్ తెలిపారు.

వైరల్ వీడియో: టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..