అప్పట్లో ఒక్కో సినిమా వెయ్యిరోజులు థియేటర్ లో ఆడేవి.. ఇప్పుడు వారం కూడా కష్టమే.. కారణం?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాని తెరకెక్కించాలి అంటే ఎంతో మంది టెక్నీషియన్లు పని చేయాల్సి ఉంటుంది.
టెక్నీషియన్లు, దర్శకులు, హీరో హీరోయిన్లు రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టపడి పని చేస్తే ఒక అద్భుతమైన సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
ఇలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తున్నాయి.ఈ క్రమంలోనే గతంలో చాలామంది హీరోలు నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద వంద రోజులు 200 రోజులు, ఏకంగా 1000 రోజులు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి.
అంతగా ప్రేక్షకులు సినిమాలను ఆదరించేవారు.అప్పట్లో మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన పోకిరి సినిమా ఏకంగా వెయ్యి రోజులు థియేటర్లో ప్రదర్శితమయి రికార్డులు సృష్టించిందని చెప్పవచ్చు.
ఇలా బాక్సాఫీస్ వద్ద ఓకే సినిమా మాత్రమే కాకుండా. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన లెజెండ్ చిత్రం ఏకంగా 1005 రోజులు ఆడి రికార్డులు సృష్టించింది.
ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే 205 రోజులు, తరుణ్ నువ్వే కావాలి 200 రోజులు, తొలిప్రేమ, ఖడ్గం, నువ్వు- నేను వంటి ఎన్నో చిత్రాలు ఏకంగా 100 రోజుల పాటు థియేటర్లో ఆడుతూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించడమే కాకుండా బాక్సాఫీసు వద్ద అత్యధిక కలెక్షన్లను రాబట్టాయి.
"""/" /
ఇలా గతంలో ఒక్కో సినిమా థియేటర్ లో సుమారు వంద రోజుల నుంచి వెయ్యి రోజుల వరకు ప్రదర్శితమయ్యేవి.
కానీ ప్రస్తుత కాలంలో ఒక్కో సినిమా కేవలం వారం రోజుల పాటు కూడా థియేటర్లో సరిగా ఆడలేక పోతుంది.
అందుకు గల కారణాలు ఎన్నో ఉన్నాయి.గతంలో సినిమా చూడాలంటే కేవలం థియేటర్ మాత్రమే ఒక ఆప్షన్ గా ఉండేది.
థియేటర్లో ఆ సినిమాని తీసేసిన తర్వాత ఎన్నో నెలలకు గాను ఆ సినిమా టీవీలో వచ్చేది కాదు.
అందుకే చాలామంది సినీ ప్రేమికులు ఇలాంటి సినిమాలను థియేటర్లలో చూడటానికి ఇష్టపడేవారు. """/" /
ప్రస్తుత కాలంలోటెక్నాలజీ అభివృద్ధి చెందడం వల్ల ఒక సినిమా కేవలం వారం రోజుల పాటు మాత్రమే థియేటర్లో ప్రదర్శితమై నెల వ్యవధిలోనే ఆ సినిమాలను ఓటీటీ ఫ్లాట్ఫామ్ లో విడుదల చేస్తున్నారు.
ఇలా సినిమాలను థియేటర్ల ద్వారా బిజినెస్ చేసి నిర్మాతలు డబ్బులు సంపాదించడమే కాకుండా ప్రస్తుతం ఓటీటీలలో విడుదల చేస్తూ మరిన్ని డబ్బులను సంపాదిస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రస్తుత కాలంలో విడుదలయ్యే సినిమాలు ఎక్కువగా థియేటర్ లో ఆడటం లేదు.
అదేవిధంగా థియేటర్లలో విడుదలైన నెల రోజుల వ్యవధిలోనే ఈ సినిమాలు ఓటీటీలో విడుదల కావడంతో చాలా మంది ప్రేక్షకులు కూడా కొద్ది రోజులు ఆగితే ఈ సినిమాని మన ఇంట్లోనే చూడొచ్చు అనే భావనలో ఉండటం వల్ల కూడా చాలామంది థియేటర్లకు వెళ్లడం లేదు.
అందుకోసమే ప్రస్తుత కాలంలో సినిమాలు థియేటర్లో ఎక్కువ రోజులు ఆడడంలేదని చెప్పవచ్చు.
మాలాంటి హీరోలకు అలాంటి డైలాగు చెప్పే హక్కు లేదు: దుల్కర్ సల్మాన్