ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డి అల్లుడు సోదరుని అరెస్టు చేసిన ఈడి..!!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.ఈ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా చాలామంది ప్రముఖ రాజకీయ పార్టీల నేతల పేర్లు వినపడుతూ ఉన్నాయి.

మరోపక్క కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ దూకుడుగా వ్యవహరిస్తున్నాయి.ఇలాంటి తరుణంలో తాజాగా ఈడి విజయ్ సాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి సోదరుడు అరబిందో ఫార్మా డైరెక్టర్.

శరత్ చంద్ర రెడ్డిని అరెస్టు చేయడం జరిగింది.ఈ కేసుకు సంబంధించి సిబిఐ ఎఫైర్ లో అరబిందో గ్రూప్ లో 12 కంపెనీలలో ఒకటైన ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ నీ కూడా చేర్చడం జరిగింది.

ఈ కంపెనీకి శరత్ చంద్రారెడ్డి డైరెక్టర్ కావడంతో సెప్టెంబర్.21, 22, 23 తారీకులలో ఈడి అధికారులు ప్రశ్నించారు.

నేడు ఆయనను ఈడీ అరెస్టు చేయడం జరిగింది. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వినయ్ బాబును కూడా అరెస్టు చేశారు.

ఇద్దరికీ కోట్లాది రూపాయల మద్యం వ్యాపారం ఉందని ఈడి వెల్లడించింది.వీరిద్దరూ పెద్ద ఎత్తున బ్లాక్ మనీని వైట్ చేయటానికి.

"""/"/ ఢిల్లీ లిక్కర్ లాబీలో పెట్టుబడులు పెట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.దాదాపుగా 2000 కోట్ల వరకు అరబిందో నుంచి ఢిల్లీ లిక్కర్ సిండికేట్ లోకి ప్రవహించాయని వార్తలు రావడం జరిగాయి.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఇప్పటికీ మూడు అరెస్టులు జరిగాయి.మొదట అభిషేక్ రావును అరెస్టు చేశారు.

నేడు స్పష్టమైన ఆధారాలు లభించడంతో శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులను ఈడి అరెస్టు చేసినట్లు సమాచారం.

అమరావతి పై కీలక నిర్ణయాలు.. ఇక పరుగులే పరుగులు