పామారోజా పంట సాగులో.. తక్కువ పెట్టుబడి తో అధిక లాభాలు..!
TeluguStop.com
వ్యవసాయ రంగంలో రోజురోజుకు పెట్టుబడుల ఖర్చు పెరుగుతూ.పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక చాలామంది రైతులు నష్టపోతున్నారు.
ఈ క్రమంలో రైతులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వచ్చే పంటల వైపు మొగ్గు చూపుతున్నారు.
అందులో పామారోజా( Palmarosa ) సాగు ఎంతో మేలు.ఈ పంట సాగు రైతులకు భారీ లాభాలు తెచ్చిపెడుతోంది.
ఇది గడ్డి వాతావరణ పరిస్థితులలో తట్టుకొని ఉండే సామర్థ్యం గల జాతి.ఎటువంటి నెలలోనైన, వర్షం, ఎండ లాంటి ఎటువంటి వాతావరణం లోనైనా తట్టుకొని అధిక దిగుబడి ఇస్తుంది.
నీటి సౌకర్యం ఉన్న లేకున్నా కూడా ఎటువంటి నష్టం ఉండదు.ఒక్కసారి ఈ పంట వేస్తే దాదాపు 5 సంవత్సరాల వరకు దిగుబడి పొందవచ్చు.
ఈ మొక్కల నుండి సేకరించిన నూనె( Oil )కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది.
ఒక ఎకరాకు దాదాపుగా 50 కిలోల నూనె ఉత్పత్తి అవుతుంది.మార్కెట్లో దాదాపుగా రూ.
2000 వరకు ధర పలుకుతోంది. """/" /
ఒక ఎకరాకు 15 కిలోల పామారోజా విత్తనాలు( Palm Rosa Seeds ) అవసరం.
కిలో విత్తనాలు రూ.2 వేలు ఉండగా ఎకరాకు రూ.
30 వేల రూపాయల విత్తనాలు అవసరం.పంట వేసినా మూడు నెలలకే మొదటి కాపు చేతికి వస్తుంది.
పంట వేసిన మొదటి సంవత్సరం దాదాపు 5 సార్లు పంట చేతికి వస్తుంది.
ఆ తర్వాత ప్రతి రెండు నెలలకు ఒకసారి పంట చేతికి వస్తుంది.ఇంకా ఈ పంటకు ఎక్కువగా చీడపీడల బెడద ఉండదు.
"""/" /
ప్రతి రెండు నెలలకు పంట తీసిన తర్వాత పశువుల ఎరువులు చల్లి, నీటి తడి అందించాలి.
ఈ పంట సాగులో రైతులు సులభంగా ఎకరాకు దాదాపుగా లక్ష రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు.
ఇక నీటి సౌకర్యం ఉండి, మంచి సారవంతమైన నేలలు ఉంటే ఆశించిన స్థాయిలో లాభాలు అర్జించవచ్చు.
ఒక బాయిలర్ ఏర్పాటు చేసుకుని సొంతంగా నూనె తీసి అమ్మితే మరింత లాభాలు పొందవచ్చు.
ఒక సంవత్సరం పెట్టిన పెట్టుబడి తో ఐదు సంవత్సరాల వరకు ఆదాయం పొందవచ్చు.
వామ్మో, ఈ మహిళ మామూలు దొంగ కాదు.. స్కూటర్‌పై వచ్చి ఏం ఎత్తుకెళ్లిందో చూడండి..