అల్మాస్ పూర్ లో రంగం చెరువు, అటవీ భూమి కబ్జా

చెరువును సందర్శించిన బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, మండల అధ్యక్షులు తిరుపతిరెడ్డిరాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sircilla )ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్ పూర్ గ్రామంలో రంగం చెరువును, అటవీ భూమిని ప్రభుత్వ అధికారులు అధికార పార్టీ నాయకుల అండదండలతో కబ్జా చేస్తున్నారని గ్రామస్తులు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి అన్నారు.

అధికార పార్టీ నాయకులతో కబ్జా కు గురవుతున్న రంగం చెరువును, అటవీ భూమిని శుక్రవారం సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్దమనిషిగా చలామణి అవుతూ కొందరు వ్యక్తులు రంగం చెరువు ను దోపిడీదారులు కబ్జా చేస్తున్నారన్నారు.

విలువైన అటవీ సంపదను( Forest ) వృక్షాలను నరుకుతూ ప్రభుత్వ ఫారెస్ట్ భూమిని కూడా చదును చేయడం ద్వారా భూమి కబ్జాకు గురవుతుందని గ్రామస్తులు పలుమార్లు అధికారులకు నాయకులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

తమ చెరువును కాపాడుకోవడానికి ఫిర్యాదు చేసిన గ్రామస్తులను,రైతులను( Farmers ) బెదిరింపులకు గురి చేస్తున్నారని,గ్రామస్తులు రైతులు ఆవేదనను వెళ్ళబుచ్చారు.

కబ్జాకు గురైన చెరువును,అటవీ సంపదను సందర్శించి జిల్లా కలెక్టర్ కి జిల్లా ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు.

సమగ్ర విచారణ జరిపి కబ్జా చేసిన సదరు వ్యక్తిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకొనిచెరువును అటవీ సంపదను కాపాడాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో గ్రామస్తులు, రైతులతో కలిసి జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నేవూరి దేవేందర్ రెడ్డి,జితేందర్ రెడ్డి, సాయి,భాను, కృష్ణ హరి, గుండాటి వెంకట్ రెడ్డి,బొమ్మాడి స్వామి,నేవూరి శ్రీనివాస్ రెడ్డి, వంగల రాజు, మిరియాల కర్ రవి,గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్ ఎక్కడ ?  కేటీఆర్ ను ఆడేసుకున్న రేవంత్