కాసేపట్లో రాజ్‎భవన్‎కు ఎన్నికల ప్రధానాధికారి..!!

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ మరి కాసేపటిలో రాజ్ భవన్ కు వెళ్లనున్నారు.

ఈ క్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను కలవనున్న ఆయన గెలిచిన అభ్యర్థుల జాబితాను అందించనున్నారు.

ఈ క్రమంలో ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ అసెంబ్లీని గవర్నర్ తమిళిసై రద్దు చేయనున్నారు.

మరోవైపు ఇవాళ కాంగ్రెస్ నేతలు మరోసారి గవర్నర్ ను కలవనున్నారని తెలుస్తోంది.ప్రభుత్వ ఏర్పాటుతో పాటు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంపై కాంగ్రెస్ నాయకులు గవర్నర్ కు సమాచారం ఇవ్వనున్నారు.

కాగా ఇవాళ రాజ్ భవన్ లో సీఎంతో పాటు ఒకరిద్దరూ డిప్యూటీ సీఎంల ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉందని సమాచారం.

జనవరి నెల బాక్సాఫీస్ రివ్యూ ఇదే.. మొత్తం సినిమాల్లో ఎన్ని సినిమాలు హిట్ అంటే?