భారత స్వాతంత్య్ర వేడుకలకు ఆతిథ్యం ఇచ్చిన యూకే పార్లమెంట్.. చరిత్రలో తొలిసారి..!!

భారత స్వాతంత్ర్య వేడుకలు( Independence Day ) ప్రస్తుతం భారత్‌తో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వెళ్లిన భారతీయులతో పాటు ఆయా దేశాల్లోని భారత దౌత్య కార్యాలయాల్లో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

తాజాగా బ్రిటన్ పార్లమెంట్ కాంప్లెక్స్( UK Parliament Complex ) భారత స్వాతంత్ర్య వేడుకలకు ఆతిథ్యం ఇచ్చింది.

ఈ ప్రాంతంలో ఇలా జరగడం ఇదే తొలిసారి.భారత 76వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని యూకే పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ఆల్‌పార్టీ పార్లమెంటరీ గ్రూప్ (ఏపీపీజీ) ( All Party Parliamentary Group )మద్ధతుతో సోమవారం సాయంత్రం వేడుకలు నిర్వహించారు.

బ్రిటీష్ ఇండియన్ థింక్ ట్యాంక్ 1928 ఇన్‌స్టిట్యూట్ ‘‘ఇండియా అండ్ ది ఇండో పసిఫిక్’’( India And The Indo-Pacific ) పేరుతో ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.

భారత్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, కెనడా, నేపాల్ ఇతర రాష్ట్రాల హైకమీషనర్లను హౌస్ ఆఫ్ రివర్ రూమ్‌లో ఒక చోట చేర్చారు.

ప్రతిపక్షనేత సర్ కీర్ స్టార్మర్ .( Sir Keir Starmer ) భారత్-యూకే సంబంధాలను మరింతగా పెంపొందించడానికి లేబర్ పార్టీ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.

యూకే పార్లమెంట్‌లో ఇలాంటి సంఘటన జరగడం ఇదే తొలిసారని స్టార్మర్ అన్నారు. """/" / లేబర్ నేత, దివంగత మాజీ ప్రధాని క్లెమెంట్ అట్లీ ప్రభుత్వంలోనే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందని ఆయన గుర్తుచేశారు.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత లేబర్ ప్రభుత్వం వేసిన పునాదులే బ్రిటన్‌ను ఆర్ధికంగా నిలబెట్టిందని స్టార్మర్ తెలిపారు.

ప్రపంచవేదికపై భారతదేశంతో కలిసి యూకే పనిచేస్తుందని చెప్పారు.గత నెలలో యూకే-ఇండియా వీక్‌లో భారతీయ ప్రవాసుల సహకారాన్ని కూడా ఆయన కోరారు.

భారత వ్యతిరేక, జాత్యహంకారానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటామని స్టార్మర్ హామీ ఇచ్చారు.కోవిడ్‌, వాతావరణ మార్పులు, ఉగ్రవాదంపై పోరాటం వరకు యూకే - ఇండియా కలిసి పనిచేశాయని స్టార్మర్ చెప్పారు.

"""/" / ఏపీపీజీ ప్రెసిడెంట్ బారోనెస్ శాండీ వర్మ మాట్లాడుతూ.భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ద్వైపాక్షిక సంబంధాలలో సాధించిన అంశాలను హైలెట్ చేశారు.

యూకే నుంచి భారత్‌కు వెళ్లిన తొలి పార్లమెంటరీ ప్రతినిథి బృందానికి ఆ దేశ ప్రభుత్వం మంచి ఆతిథ్యం ఇచ్చిందని శాండీ వర్మ గుర్తుచేశారు.

2016 నవంబర్‌లో థెరిసా మే ప్రధానమంత్రిగా వున్నప్పటి నుంచి భారతదేశానికి బ్రిటీష్ వాణిజ్య ప్రతినిధి బృందం లేకపోవడాన్ని ఆయన ఎత్తిచూపారు.

యూకేలో భారత హైకమీషనర్ విక్రమ్ దొరైస్వామి మాట్లాడుతూ.ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని నిర్మించడంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

వైరల్ వీడియో: ఆఫ్రికాను తాకిన మంచు తుఫాను.. మంచులో ఎంజాయ్ చేస్తున్న సింహాలు..