రూ. 10 పెరుగనున్న పెట్రోల్‌, కారణం ఇదే

2020 వరకు పెట్రోల్‌ ధర వందకు చేరుతుందని గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో టాక్‌ నడుస్తోంది.

పరిస్థితి చూస్తుంటే అది నిజం అయ్యేలా అనిపిస్తుంది.ప్రస్తుతం పెట్రోల్‌ ధర రూ.

75కు పైగానే ఉంది.మరో రెండు మూడు రోజుల్లో ఆ ధర రూ.

10 పెరిగి ఏకంగా 85కు చేరబోతుంది.ఈమద్య కాలంలో ఒకేసారి ఇంత భారీ మొత్తంలో పెరుగుదల లేదు.

కాని పెట్రోల్‌ ఉత్పతి తగ్గడం వల్ల ఏకంగా 10 రూపాయలు పెరగబోతున్నట్లుగా మార్కెట్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

సౌదీలోని అరామ్కో ఆయిల్‌ రిఫైనరీ ప్రపంచంలోనే అతి పెద్ద పెట్రోలియం ప్రాసెసింగ్‌ యూనిట్‌.

అక్కడ హుతి రెబల్స్‌ డ్రోన్‌ దాడి చేయడం జరిగింది.దాంతో పెట్రోల్‌ బావులు బాగా దెబ్బ తిన్నాయి.

ఆ బావులను మళ్లీ పునరుద్దరించే వరకు అరామ్కో ఆయిల్‌ సంస్థ ఉత్పత్తిని సగానికి చేసింది.

మళ్లీ పెట్రోల్‌ బావులు పునరుద్దరించబడిన తర్వాత పూర్తిగా ఉత్పత్తి చేస్తామంటూ ప్రకటించడం జరిగింది.

ఆయుల్‌ ఉత్పత్తి తగ్గిన కారణంగా మరో రెండు మూడు రోజుల్లో కొరత ఏర్పడబోతుంది.

దాంతో పాటు రేటు కూడా 8 నుండి 10 రూపాయల వరకు పెరుగుతుందని సమాచారం అందుతోంది.

సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..?: పోసాని