మాఘ మాసం అంటే ఏమిటి… విశిష్టత.!

తెలుగు నెలలు 11వ నెల అయిన మాఘ మాసం ఎంతో పవిత్రమైనది.చంద్రుడు ముఖ నక్షత్రంతో కూడుకున్న మాసం కాబట్టి ఈ నెల మాఘమాసం అయ్యింది.

ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాఘమాసం అంటే ఆ విష్ణుమూర్తికి ఎంతో పవిత్రమైనది.

మాగం అంటే యజ్ఞం కాబట్టి ఈనెల యజ్ఞ యాగాలకు ఎంతో పరమపవిత్రమైనదని చెబుతారు.

అదేవిధంగా ఈ మాఘమాసంలో నదీ స్నానాలను ఆచరించడం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయని ఎంతో విశ్వసిస్తారు.

"""/" / పురాణాల ప్రకారం మృకండుముని, మనస్వినిలు మాఘస్నాన చేయడం వల్ల వచ్చిన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథలు చెబుతున్నాయి.

కనుక మాఘస్నానాలు సకల పాపాలను నశింప చేస్తాయని ప్రగాఢ విశ్వాసం.ఈ మాఘ స్నానాలకు అధిష్ఠానదైవం సూర్య భగవానుడు.

కనుక స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం.మాఘ మాసంలో వచ్చే పౌర్ణమిని మహామాఘం అంటారు.

ఈ పౌర్ణమి రోజు స్నానదాన జపాలకు అనుకూలం.ఈ రోజున సముద్రస్నానం చేయటం వల్ల మహిమాన్విత ఫలదాయకమనీ ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

మాఘ మాస నెలలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి వేకువజామునే స్నానాలు చేయటం ఒక వ్రతంగా భావిస్తారు.

ఈ నెలలో వేకువజామునే ఎవరికి తోచిన విధంగా వారు నదీజలాలు, కాలువలు, కొలనులు, బావి వంటి వాటిలో స్నానాలు చేయడం వల్ల ప్రయాగలో స్నానం చేసినటువంటి పుణ్యఫలం దక్కుతుందని చెబుతుంటారు.

అదే విధంగా ఈ మాఘమాసంలో ఉదయం నువ్వుల నూనెతో దీపారాధన, హోమం, నువ్వులను దానం చేయడం ఎంతో పుణ్యఫలం.

అదేవిధంగా మాఘ మాసంలో వచ్చేటటువంటి శుద్ధ విదియనాడు బెల్లం, ఉప్పు దానం చేయడం ఎంతో మంచిది.

ఇంతటి పవిత్రమైన ఈ నెలలో ఆ విష్ణు భగవానుడికి లేదా శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.

వారానికి ఒక్కసారి ఈ ఆకును తింటే మీ ఆరోగ్యానికి తిరుగే ఉండదు!