గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచండి: డిపిఓ సురేష్
TeluguStop.com
సూర్యాపేట జిల్లా: గ్రామాల్లో పేరుకుపోయిన చెత్త చెదారం తొలగించి పారిశుద్ధ్యాన్ని మెరుగు పరచాలని జిల్లా పంచాయతీ అధికారి సురేష్ ఆదేశించారు.
మంగళవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్ గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించి,తనిఖీ చేశారు.
గ్రామంలోని వీధులను, పశువుల సంత పరిసరాలను పరిశీలించి అపరిశుభ్రత చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో వీధులు తక్షణమే శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
అంతకు ముందు గ్రామంలో మొక్కలను పంపిణి చేశారు.కార్యక్రమంలో ఎంపీడీఓ ఎండి.
హసీం, పంచాయతీ కార్యదర్శి సుధాకర్, గ్రామ పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నాగార్జున 100 వ సినిమా డైరెక్టర్ దొరికేసాడా..?