వీరమల్లుపై క్రేజీ అప్డేట్ ఇచ్చిన క్రిష్.. ఫ్యాన్స్ ఖుషీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.

ఈ సినిమా తర్వాత కూడా వరుస సినిమాలు లైన్లో పెట్టడంతో ఆయన ఫ్యాన్స్ సంతోష పడ్డారు.

అయితే భీమ్లా నాయక్ సినిమా వచ్చి నెలలు గడుస్తున్న మరో సినిమా షూటింగ్ ను పూర్తి చెయ్యలేదు.

పవన్ చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్న కూడా ఈయన సెట్ లోకి అడుగు పెట్టక చాలా రోజులే అవుతుంది.

పవన్ చేస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు ఒకటి.ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

ఇప్పటికే ఈ సినిమా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.అయితే ఈ సినిమా పలు కారణాలతో షూటింగ్ నిలిచి పోయింది.

కానీ మొదటిసారిగా పవన్ పీరియాడిక్ యాక్షన్ సినిమాలో నటిస్తుండడం అలాగే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

ఇక ఎన్నో రోజుల తర్వాత ఈ సినిమా కోసం పవన్ మళ్ళీ రెడీ అవుతున్నాడు.

అంతేకాదు ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాడు. """/"/ ప్రెజెంట్ ఈ సినిమా శరవేగంగా వర్క్ షాప్ షెడ్యూల్ జరుగుతుంది.

అందులో భాగంగా క్రిష్, నిర్మాత, పవన్ కూడా పాల్గొంటున్నారు.మరి తాజాగా ఈ వర్క్ షాప్ గురించి లేటెస్ట్ అప్డేట్ క్రిష్ అందించారు.

ఈ సినిమా వర్క్ షాప్ షెడ్యూల్ ఈ రోజుతో పూర్తి అవుతుంది అని తన ఇంస్టాగ్రామ్ ద్వారా క్రిష్ తెలిపాడు.

ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ అక్టోబర్ లోనే స్టార్ట్ చేయనున్నారు.పవన్ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఈ షూట్ లో పాల్గొనబోతున్నారు.

దీంతో ఈ సినిమా విషయంలో పవన్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.

కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.మెగా సూర్య ప్రొడక్షన్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

నడుము నొప్పితో వర్రీ ఎందుకు.. ఈ వంటింటి చిట్కాలతో ఈజీగా చెక్ పెట్టండి!