రుషికొండ తవ్వకాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
TeluguStop.com
విశాఖలోని రుషికొండ తవ్వకాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.సమగ్ర సర్వేకు నియమించే బృందంలో ఉన్న ముగ్గురు రాష్ట్ర అధికారులను తొలగించాలని న్యాయస్థానం ఆదేశించింది.
కేంద్ర శాఖల అధికారులతో ఐదుగురు సభ్యులను నియమించాలని సూచించింది.ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తవ్వకాలపై నిగ్గు తేల్చేందుకు సమగ్ర సర్వే చేయాలని తెలిపింది.జనవరి 31 లోపు నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించడంతో పాటు కమిటీలో సభ్యుల వివరాలు హైకోర్టుకు పంపాలని వెల్లడించింది.
భారతీయులకు ఇజ్రాయెల్ గుడ్‌న్యూస్ .. అందుబాటులోకి ‘ఈ-వీసా’, దరఖాస్తు ఎలా అంటే?