జమిలి ఎన్నికలపై లా కమిషన్ కీలక సమావేశం

జమిలి ఎన్నికల అంశంపై లా కమిషన్ మరి కాసేపటిలో కీలక సమావేశం నిర్వహించనుంది.

ఈ మేరకు ఉదయం 11 గంటలకు కమిషన్ ఛైర్మన్ జస్టిస్ రితురాజ్ అవస్థి నేతృత్వంలో భేటీ కానుంది.

ఇందులో భాగంగా వన్ నేషన్ - వన్ ఎలక్షన్స్ పై తమ వైఖరిని లా కమిషన్ ఖరారు చేయనుందని తెలుస్తోంది.

ఈ క్రమంలో జమిలి ఎన్నికలకు అవసరమైన రాజ్యాంగ సవరణలపై లా కమిషన్ చర్చించనుంది.

అదేవిధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 83, 85, 172, 174 మరియు 356 లో సవరణలపై కమిషన్ కసరత్తు చేయనుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి9, గురువారం 2025