కార్తిక మాసంలో శివుడికి ఇదొక్కటి సమర్పిస్తే 1000 జన్మల పుణ్యం

పవిత్రమైన కార్తీక మాసం ఎన్నో పుణ్య ఫలాలను ఇస్తుంది.ఈ కార్తీక మాసం పరమ శివునికి ఇష్టమైన మాసం.

ఈ కార్తీక మాసం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ మాసంలో మనం దేవుడికి చిన్న పువ్వు పెట్టిన అది పరమ శివునికే అందుతుంది.

అందువల్ల ఈ కార్తీక మాసం రోజుల్లో పుణ్యం చేస్తే మంచిది.ఆ పుణ్యం మన పిల్లలనే కాకుండా మన తరతరాలను కూడా రక్షిస్తుంది.

కార్తీక మాసం అనేది కేవలం శివునికి సంబందించినది మాత్రమే కాదు విష్ణువుకు కూడా ఈ కార్తీక మాసంలో సంబంధం ఉంది.

ఈ మాసంలో విష్ణువుకు పూజ చేస్తే అఖండ కోటి పుణ్య లోకాల్లో కలిసిపోతుంది.

అయితే ఇంత పవిత్రమైన కార్తీక మాసంలో మనం పాటించవలసినది ఒకటి ఉంది.దీని వలన మనకు ఐశ్వర్యం కలగటమే కాకుండా ఆరోగ్య సమస్యలు దరికి రావు.

ఈ విధంగా చేయటం వలన ఏమైనా గ్రహ దోషాలు ఉన్నా తొలగిపోతాయి.అయితే ఏమి చేయాలో తెలుసుకుందాం.

ప్రతి రోజు తులసి మొక్కకు నీటిని పోస్తూ నమస్కారం చేయాలి.మగవారైనా, ఆడవారైనా తులసి మొక్కకు నీళ్లు పోసి నమస్కారం చేయటం వలన జన్మ జన్మల పుణ్యం లభిస్తుంది.

అలాగే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. """/"/ ముఖ్యంగా ఆడవారు తులసి మొక్క దగ్గర దీపం, అగరవత్తులు వెలిగించి కుంకుమ, పసుపు, అక్షింతలు, పువ్వులు వేసి నమస్కారం చేస్తే ఐదవతనం, కడుపు చలవ తులసి మాత ఇస్తుంది.

కడుపు చలవ అంటే మీరు, మీ పిల్లల కుటుంబాలు ఎప్పుడు చల్లగా ఉంటాయి.

కార్తీక మాసంలో ప్రతి రోజు చేయవలసింది మరొకటి ఉంది.అది ఏమిటంటే ఉసిరికాయ మీద నెయ్యిలో తడిపిన పువ్వు ఒత్తులను పెట్టి తులసి దగ్గర వెలిగించాలి.

ఈ విధంగా చేయటం కోటి జన్మల పుణ్యాన్ని ఇస్తుంది.అలాగే శివుడు, విష్ణువు అనుగ్రహం ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది.

మౌనం వీడిన కవిత : అదానికో న్యాయం.. ఆడ బిడ్డకో న్యాయమా ?