రేపే మాఘ పౌర్ణమి, మాఘ పౌర్ణమి నాడు అవి దానం చేస్తే ఏమవుతుందో తెలుసా?

మాఘము అంటే పాపాలను నశింప చేసేది అనే అర్థాన్ని పండితులు చెబుతున్నారు.అందుకే మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది.

మాఘ స్నానం వల్ల ఆనందం,ఐశ్వర్యం,ఆరోగ్యం,ఆయుష్షుతోపాటు మంచితనం, ఉత్తమ శీలం లభిస్తాయని పద్మ పురాణం చెబుతోంది.

రేపే మాఘ పౌర్ణమి.విశిష్టమైన రోజు.

మాఘ పౌర్ణమినే మహా మాఘి అని కూడా అంటారు.మాఘమాసంలో దేవతలు తమ సర్వ శక్తులు,తేజస్సులను జిలాల్లో ఉంచుతారు.

అందువల్ల మాఘ స్నానం చాలా గొప్పది.నది దగ్గరలో లేని వారు కనీసం చెరువులో గానీ,కొలనులోగానీ,లేక బావి దగ్గర గానీ స్నానం ఆచరించాలి.

మాఘ స్నానం ప్రవాహ జలంలో చేస్తే అధిక ఫలితం ఉంటుంది.స్నానాంతరం సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి.

వైష్ణవ,శివాలయానికి గానీ వెళ్లి దర్శనం చేసుకోవాలి.అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడమే కాకుండా శక్తిమేరకు దానధర్మాలు చేయాలి.

ఈ రోజున గొడుగు,నువ్వులు దానం చేస్తే విశేష ఫలం లభిస్తుంది.దీని వల్ల జన్మ జన్మలుగా వెంటాడుతోన్న పాపాలు,దోషాలు నశించి,అశ్వమేథ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శ్రీ కృష్ణుడే ధర్మరాజుతో చెప్పాడని పురణాల్లో ఉంది.

మాఘ పౌర్ణమి రోజున చేసే స్నానం,పూజలు,దానాలు వల్ల వ్యాధులు,చికాకుల నుంచి విముక్తి కలుగుతుంది.

ఆ పుణ్య ఫలాల విశేషం కారణంగా ఉన్నత జీవితం లభిస్తుంది.మరణం అనంతరం కోరుకునే శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది.

‘గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి,నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు అనే శ్లోకం పఠిస్తూ స్నానం ఆచరించాలి.

Bandi Sanjay : చెంగిచర్లలో రోహింగ్యాల మాఫియా దందా అరికట్టాలి..: బండి సంజయ్