నదీ స్నానం ఎందుకు చేయాలి? లాభాలేంటి?
TeluguStop.com
నదీ స్నానం చేయడం వల్ల పాపాలు తొలిగి పోతాయని పెద్దలు చెబుతుంటారు. అలాగే మనం తెలిసీ తెలియక చేసే కొన్ని పాపాలు కూడా పోతాయని అంటుంటారు.
అందుకే కఠినంగా మాట్లాడటం, అబద్ధాలు చెప్పడం, పొంతన లేని, సమాజం లేని వినలేని మాటలు మాట్లాడడం. ఈ నాలుగు మాటల ద్వారా చేసే పాపాలు.
తనది కాని ధనం, వస్తువుల మీద వ్యామోహం, ఇతరులకు ఇబ్బంది కల్గించే పనులు చేయడం, ఇతరులకు చెడు చేయాలనుకోవడం ఈ మూడు మానసిక పాపాలు.
అర్హత లేని వారికి దానం ఇవ్వటం, శాస్త్రం ఒప్పుకోని హింసను చేయడం, పర స్త్రీని లేదా పురుషుడికి స్వీకరించడం.
ఈ మూడూ శరీరంతో చేసే పాపాలు.ఈ పది పాపాలను తొలగించుకునేందుకు నదీ స్నానం చేయడం మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
అందుకే ఏడాదికి ఒకసారైనా నదీ స్నానం చేయాలని అంటుంటారు. ఆ తర్వాత దైవ దర్శనం చేసుకోవడం మరింత మంచిదని చెబుతుంటారు.
అందుకే ఎక్కువ మంది భక్తులు నదులు, చెరువులు, వాగులు, వంకల వద్ద కూడా స్నానాలు చేస్తుంటారు. ఒకే దగ్గర ఆగే నీరు కాకుండా.
పారే నీటిలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయంట. """/" /
నదీ స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని చదివితే చాలా మంచి జరుగుతుందట.
అంతే కాకుండా ఇంట్లో స్నానం చేసినా.గంగా స్నానం చేసిన ఫలితం దక్కాలంటే ఈ కింది శ్లోకం చదవాలని పెద్దలు చెబుతుంటారు.
శ్లో గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిథమ్ కురుII.
వీడియో వైరల్: విద్యుత్ షాక్‌తో విలవిలాడిన తల్లీకొడుకులు