మారేడు చెట్టు మహాశివుడితో సమానమా? తప్పక పూజలు చేయాల్సిందేనా?
TeluguStop.com

మారేడు చెట్టు మహా దేవుడు అయిన శివుడి స్వరూపం.ఆ చెట్టును సామాన్య మానవులే కాకుండా మూక్కోటి దేవతలూ స్తుతిస్తుంటారట.


లోకంలో ప్రసిద్ధి చెందిన పుణ్య తీర్థాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ మారేడు చెట్టు పొదలో ఉంటాయని చెబుతుంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.


అంతే కాదండోయ్ మారేడు చెట్టు మహిమ గురించి పురాణ ఇతిహాసాల్లో కూడా వివరించబడింది.
మారేడు చెట్టు మూలంలో లింగ రూపంలో ఉన్న మహా శివుడిని పూజించటం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందట.
ఆ చెట్టు మొదట్లో స్నానం చేసిన వారికి సర్వ పుణ్య తీర్థాలలో స్నానం చేసినంత పుణ్యం వస్తుంది.
అలా స్నానం చేసిన వాడే అసలైన పవిత్రుడని పురాణాల్లోని పలు చోట్ల చెప్పబడింది.
ఇక మారేడు చెట్టు కుదురు ఎంతో గొప్పదట.అది నీటితో తడిసి ఉన్నప్పుడు మహా దేవుడు చూస్తే.
ఆయనకు ఎంతో ఆనందం కల్గుతుందట.అందుకే శివుడి అనుగ్రహం పొందాలి అనుకునే వారు మారేడు చెట్టు మొదటిని నిత్యం నీటితో తడుపుతారు.
పసుపు, కుంకుమ, పూలతో ఆ మూలాన్ని పూజించిన వారు శివ లోక అర్హతను కూడా పొందుతారని ప్రతీతి.
"""/" /
అంతే కాకుండా భక్తుల ఇంట సంతానం, సుఖం వర్ధిల్లుతూ ఉంటుందట.
అందుకే మహా శివరాత్రి నాడు ఆ పరమేశ్వరుడికి ఇష్టమైన మారేడు కొమ్మలను, కాయలను స్వామి వారికి ప్రసాదంగా నివేదిస్తారు.
ఇంతటి మహిమ గల మారేడు చెట్టుకూ వీలున్నప్పుడు మనం కూడా పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.