కంకణాలను ఎప్పుడు ధరిస్తారో తెలుసా?

వ్రతాలు,నోములు, యజ్ఞాలు మరియు ముఖ్యమైన శుభకార్యాలు చేసినప్పుడు కంకణాలనుకట్టుకుంటూ ఉంటారు.కంకణం కట్టుకుంటే ఒక ఆలోచనకు,ఒక ధర్మానికి కట్టుబడి ఉంటామని మన పెద్దవారి ఆలోచన.

కంకణానికి అధిపతి సుదర్శన భగవానుడు.మనం కట్టుకున్న కంకణం మనం చేసే మంచి పనులను,చేసే పనులను,ఆలోచనలను గుర్తు చేస్తూ ఉంటుంది.

ఇలా కట్టుకోవటం వెనక ఒక ఆరోగ్య ప్రయోజనం కూడా దాగి ఉంది.కంకణం మణికట్టుకు కట్టుకోవటం వలన రక్త ప్రసరణ చాలా బాగుంటుంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" / కంకణం అనేది పూజను బట్టి ఉంటుంది.కంకణాన్ని ఎక్కువగా పసుపు రాసిన దారానికి లేత మామిడాకు లేదా తమలపాకు మరియు పసుపు కొమ్ముని కడతారు.

కంకణానికి ఉపయోగించే పసుపు దారం మూడు లేదా ఐదు పోగులు అంటే బేసి సంఖ్యలో ఉండాలి.

!--nextpage కంకణ ధారణ చేసేటప్పుడు ప్రశాంతమైన మనస్సు, దృఢమైన సంకల్పం,భక్తి అనేవి ఉండాలి.కంకణ ధారణ చేయటానికి ముందు తలస్నానము చేసి ఆరవేసిన బట్టలను కట్టుకొని భక్తితో నమస్కారం చేసి, చేతితో పువ్వును గానీ పండునుగానీ, కొబ్బరికాయ లేదా కొబ్బరి బోండాన్ని గానీ పట్టుకుని కంకణం కట్టుకోవాలి.

మగవారు అయితే కుడి చేతికి,ఆడవారు అయితే కంకణాన్ని ఎడమ చేతికి కట్టుకోవాలి.