కలశం అంటే ఏమిటి? దానిని ఎందుకు పూజిస్తారు?

హిందూ సంప్రదాయం ప్రకారం గృహ ప్రవేశాలకు, వివాహాలకు,కొన్ని పూజలు చేసుకునే సమయంలో కలశం పెట్టి పూజ చేస్తూ ఉంటాం.

ఇత్తడి లేదా రాగితో తయారుచేసిన ఒక పాత్రలో నీటిని పోసి మామిడి ఆకులు వేసి కొబ్బరికాయ పెడతాం.

ఆ పాత్ర మెడ చుట్టూ నలుపు లేదా తెలుపు దారాన్ని చుడతాం.ఈ విధంగా తయారుచేసిన పాత్రను కలశం అని అంటారు.

అసలు కలశాన్ని ఎందుకు పూజించాలంటే.దానికి ఒక కథ ఉంది.

దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.పూర్వం సృష్టి ఆవిర్భవానికి ముందు.

పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువు తన శేషశయ్యపై పవళించి ఉన్న సమయంలో అతని నాభి ప్రాంతం నుంచి వెలువబడిన పద్మం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు.

అలా ఉద్భవించిన బ్రహ్మ.ఈ యావత్ ప్రపంచాన్ని సృష్టించాడు.

అదేవిధంగా కలశంలో వున్న నీరు సృష్టి ఆవిర్భవంలో ప్రథమంగా పుట్టిన నీటికి ప్రతీకగా నిలుస్తుంది.

మామిడి ఆకులు, కొబ్బరికాయ సృష్టికి ప్రతీకలుగా నిలుస్తాయి.కళాశానికి కట్టిన దారం సృష్టిలో బందించబడిన ప్రేమను సూచిస్తుంది.

అందువలన కళాశాన్ని శుభ సూచకంగా సూచిస్తారు.

ఆమెను దూరం పెట్టాలని కోరుకుంటున్న మెగా ఫ్యాన్స్.. అభిమానులకు ఇది భారీ షాక్!