ఇన్ని రకాల చందనాలలో ఏ దేవుడికి ఏ చందనం అంటే ఇష్టమో తెలుసా..?

ఎర్రచందనం, పచ్చ చందనం,తెల్ల చందనం, హరిచందనం, గోపీచందనం ఇలా రకరకాల పేర్లతో చాలా రకాల చందనలను( Chandan ) పూజ చేసేటప్పుడు ఉపయోగిస్తూ ఉంటారు.

గంధం లేని పూజ పూర్తి కాదని కచ్చితంగా చెప్పవచ్చు.శ్రీ మహావిష్ణువుకి( Sri Mahavishnu ) చందనాన్ని తిలకంగా ఆలంకరిస్తారు.

ఇంకా ఆయా చందనాల మాలలని జపాని కి ఉపయోగిస్తారు.ముఖ్యంగా చెప్పాలంటే తెల్ల చందనం మాల ధరించడం వల్ల శ్రీమహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని సాధనలో ఉన్నవారికి ప్రశాంతత, సంతోషం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని ప్రజలు నమ్ముతారు.

తెల్లగంధం మాల ధరించడం మాత్రమే కాకుండా తిలకం కూడా శుభప్రదమే అని పండితులు చెబుతున్నారు.

శ్రీ రాముడు,శ్రీకృష్ణుడు శివరాధనలో చందన తిలకం సమర్పించిన తర్వాత ప్రసాదంగా నుదుటన ధరించడం వల్ల సకల పాపాలు నశించి పుణ్యం లభిస్తుందని ప్రజలు నమ్ముతారు.

అలాగే నుదుటి మీద ఉంచిన తిలకం అన్ని విపత్తులను దూరం చేస్తుంది. """/" / ఇంకా చెప్పాలంటే ఎర్రచందనం కలప ముక్కలను( Red Sandal ) శక్తి పూజలో ఉపయోగిస్తారు.

ఎర్రచందన మాలతో దుర్గాదేవి మంత్ర జపం చేస్తే ఆమె కోరుకున్న వరాలను తప్పకుండా తీరుస్తుంది.

అంతే కాకుండా ఈ పూజ ద్వారా అంగారకుడికి చెందిన మంగళ దోషం దూరం అయిపోతుందని కూడా నమ్ముతారు.

ప్రతిరోజు ఉదయం రాగి పాత్రలో నీరు తీసుకునే అందులో ఎర్రచందనం, ఎర్రని పువ్వులు,బియ్యం వేసి భక్తితో సూర్య మంత్రాన్ని జపిస్తూ సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి.

"""/" / ఈ అర్ఘ్య దానంతో సూర్యుడు అనుగ్రహం పొందవచ్చు.సూర్యుడి కటాక్షం ఉంటే ఆయుష్షు, ఆరోగ్యం, సంపద, పుత్రులు, స్నేహితులు, కీర్తి ప్రతిష్టలు, అదృష్టం వైభవంగా లభిస్తాయి.

అలాగే గోపీచందనం కృష్ణుడికి ఎంతో ఇష్టమైనది.స్కంద పురాణంలో దీని ప్రస్తావన ఉంది.

ముందుగా శ్రీకృష్ణుడికి సమర్పించిన గోపీచందనాన్ని భక్తులు నుదుటన తిలకంగా ధరిస్తారు.ఇలా గోపీచందనం తిలకంగా ధరించిన వారికి సకల తీర్థ స్థానాలలో దానధర్మాలు చేసి, ఉపవాసం చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది.

కోచింగ్ టీచర్‌ను కర్రతో కొట్టిన స్టూడెంట్, అతడి ఫ్రెండ్స్.. వీడియో వైరల్..