కర్పూరం వాడితే ఎన్ని వ్యాధులను నయం చేసుకోవచ్చో తెలుసా..?!

నాడీ వ్యవస్థ మొత్తం శరీరంలో వ్యాపించి ఉన్నందున, శరీర భాగాలకు ఏదైనా గాయం లేదా ఒత్తిడి ఎదురైనప్పుడు నరాలు బలహీనపడటానికి దారితీయవచ్చు.

క్షీణించిన నరాలు, అనారోగ్యకరమైన ఆహారం, మందులు, అంటువ్యాధులు, జన్యుశాస్త్రం మరియు పోషక లోపం కూడా నరాల బలహీనతలకు ఇతర కారణాలు.

నరాల బలహీనతను నయం చేయడంలో ఇంటి నివారణలు లేదా సహజ చికిత్సా పద్ధతులు ప్రభావవంతంగా పని చేస్తాయి.

వైద్య శాస్త్రం అభివృద్ధి చెందని పురాతన కాలం నుండి కూడా ఈ నివారణలు ఉపయోగించబడుతున్నాయి.

అయితే కర్పూరం వలన నరాల ఇబ్బందులను తగ్గించుకోవచ్చు.ఆయుర్వేద చికిత్సలో కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.

అన్ని రకాల ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పుల నివారిణిగా, నరాల సంబంధమైన సమస్యలు, వీపు నొప్పికి కర్పూరం బాగా పనిచేస్తుంది.

పుండ్లు మానడానికి, పిల్లలకు గజ్జి, బొబ్బలు తగ్గడానికి, బ్రాంకయిటిస్, పలు రకాల ఇన్ఫెక్షన్లకు కర్పూరం ఉపయోగిస్తారు.

స్వల్ప గుండె సమస్యలు, అలసట సమస్యలకు కొద్ది మొత్తం కర్పూరం వాడితే ఫలితముంటుంది.

నాసికా సమస్యలకు యాంటిసెప్టిక్ గా కూడా దీనిని ఉపయోగిస్తారు.అందుకే విక్సు వెపోరబ్, కొన్నిరకరాల ఆయింట్మెంట్లన్నిటిలోనూ, చర్మం పై పుతగాపూసే లేపనములలోను, శ్వాసనాళాల్లో ఊపిరి సలపడానికి వాడే మందులలోను కర్పూరం వాడతారు.

"""/"/ కర్పూరం నూనెలో దూదిని తడిపి లెప్రసీ వ్యాధివల్ల ఏర్పడిన గాయంమీద ప్రయోగిస్తే త్వరితగతిన మానుతుంది.

కర్పూరాన్ని పొడిచేసి, నోటిలో ఉంచుకొని లాలాజలాన్ని మింగుతుంటే అతి దప్పిక తగ్గుతుంది.కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది.

అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది.కళ్ళకు మేలు చేస్తుంది కనుకనే కాటుకలో దీనిని వాడతారు.

జలుబును, కఫాన్ని తగ్గిస్తుంది.మానసిక జబ్బులను సైతం పోగొడుతుంది.

రక్తాన్ని శుద్ధి చేసి రక్త ప్రసరణ సవ్యంగా ఉండేలా చేస్తుంది.అలజడులు, ఆందోళనలు తగ్గించి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది.

కర్పూరం పురుగుల మందులు, చెడువాసనల నిర్ములనకు, బట్టలను కొరికి తినే చెదపురుగులు, నిర్మూలనకు ఉపయోగిస్తుంటారు.

మహేశ్ బాబు మూవీ కోసం ప్రియాంక చోప్రా రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!