ధనత్రయోదశి అంటే బంగారం కొనడం కాదు.! లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఇలా చేయాలి.?
TeluguStop.com
దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలుకుతున్న సమయంలో ఆ పాల సముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది.
అంతే కాదు.సంపదలను ప్రసాదించే కల్పవృక్షం, కామధేనువు, దేవవైద్యుడు ధన్వంతరి కూడా శ్రీ మహాలక్ష్మితో పాటే జన్మించారు.
ఆ రోజు ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి.ఎంత చదువు చదివినా.
,, ఎన్ని తెలివి తేటలు ఉన్నా., శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే జీవితం శూన్యం.
అందుకే.సర్వ సంపద ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వ మానవాళి ఈ రోజున శ్రీమహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి, ఆమె ఆశీస్తూలు అందుకుంటారు.
శ్రీమహాలక్ష్మి ., ధనానికి ప్రతిరూపం.
అందుకే., ఆమె జన్మదినమైన ఈ ఆశ్వయుజ కృష్ణ త్రయోదశిని.
‘ధన త్రయోదశి’ అన్నారు.ఇదే రోజును ‘యమ త్రయోదశి’ గానూ పరిగణిస్తారు.
పూర్వం ‘హిమ’ అనే రాజుకు లేక లేక కొడుకు పుడతాడు.వివాహమైన నాలుగో రోజునే ఆ రాకుమారుడు మరణిస్తాడని కొందరు హెచ్చరిస్తారు.
కాలక్రమంలో ఒక రాజకుమారి అతణ్ని వరించి పెళ్లాడుతుంది.భర్తను తానే కాపాడుకుంటానని ధీమాగా చెబుతుంది.
పెళ్లయిన నాలుగో రోజున రాకుమారుడి గది ముందు బంగారు నగలు, ఇతర ఆభరణాలు రాశులుగా పోసి దీపాలు ఉంచుతుంది.
లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో స్తుతిస్తూ, గానం చేస్తుంటుంది. """/" /
అదే సమయానికి, రాకుమారుడి ప్రాణాలు తీసుకువెళ్లేందుకు యముడు పాము రూపంలో వస్తాడు.
నగల మీద పడిన దీపకాంతి వల్ల, ఆయన కళ్లు చెదురుతాయి.యువరాణి పాటలకు మైమరచిపోతాడు.
మృత్యుఘడియలు దాటి, యముడు శూన్యహస్తాలతో వెనుదిరిగాడన్నది వేరొక కథనం.ఈరోజు త్రయోదశి వేళ, యముడి ప్రీతి కోసం దీపాలు వెలిగిస్తే మృత్యుభయం ఉండదనీ అంటారు.
ధనత్రయోదశి రోజున మన ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను పసుపునీళ్ళలో శుభ్రంగా కడిగి లక్ష్మీదేవి అమ్మవారికి అలంకరించి పూజించాలి.
ఈ రోజు లక్ష్మీదేవి అమ్మవారిని బంగారు నగలతో అలంకరించి, అందంగా సుగంధ పరిమళాలు వెదజల్లే పూలతో అలంకరించుకుని లక్ష్మీ పూజ చేసి గోమాతకు అరటిపండ్లు తినిపించిన వారికి అరిష్టాలు తొలగి దైవానుగ్రహాన్ని పొందేందుకు ఒక చక్కని మార్గంగా సూచింపబడినది.
"""/" /
ఈ యమ దీపం అనేది విధ్యుత్ దీపంతో కాదు.చక్కగా మట్టితో చేసిన జోడి (రెండు) ప్రమిదలలో మూడు వత్తులు వేసి రెండు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనెతో దీపారధన చేయాలి.
ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజించి ఇంట్లో స్వయంగా తయారు చేసిన తీపి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగాపెట్టి అమ్మవారిని కొలవడం వలన అష్ట ఐశ్వర్య ,భోగభాగ్యాలతో పాటు అన్ని రకాల సంపదలు లభిస్తాయని విశ్వాసంతో చేస్తూఉంటారు.
ముఖ్యంగా మనం ఇక్కడ గమనించ వలసిన విషయం ఒకటి ఉన్నది.ఈ రోజు బంగారం లేదా కొత్తగా బంగారు ఆభరాణలు కొనాలి అని కొంత మంది తమదగ్గర డబ్బులు లేక పోయిన ఏదో ఒక రకంగా నా నా తంటాలు పడి కొనేస్తుంటారు అది తప్పు.
ఇది కేవలం అమ్మ వారిని ఇంట్లో మన శక్తి సామర్ధ్యలకు తగ్గట్టుగా ఇంట్లో ఉన్న పాత బంగారు నగలనే అమ్మవారికి అలంకరించి పూజించడమే ప్రధాన ఉద్యేశ్యం.