ఆర్థిక సంక్షోభం ఉన్నా సంక్షేమ పథకాలు అమలు..: మంత్రి పొన్నం

సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

వేడుకల అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అన్ని మతాలను గౌరవిస్తుందని తెలిపారు.ఎంత ఆర్థిక సంక్షోభం ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

హుస్నాబాద్ లో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు స్థల సేకరణ చేస్తున్నామన్న ఆయన హుస్నాబాద్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

అలాగే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పక అమలు చేస్తామని స్పష్టం చేశారు.

ఇందులో ఇప్పటికే రెండు హామీలను అమలు చేశామన్న ఆయన మిగతా హామీలను కూడా త్వరలోనే అమల్లోకి తీసుకువస్తామని వెల్లడించారు.

వైరల్ వీడియో: నడిరోడ్డుపై సింహాన్ని చుట్టేసిన కొండచిలువ