అనంతపురం జిల్లా తాడిపత్రిలో 144 సెక్షన్ అమలు..!!

అనంతపురం జిల్లాలోని( Anantapur District ) తాడిపత్రిలో( Tadipatri ) 144 సెక్షన్ కొనసాగుతోంది.

రాష్ట్రంలో పోలింగ్ అనంతరం తరువాత చోటు చేసుకున్న సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

ఈ మేరకు తాడిపత్రిలోకి వచ్చే ప్రధాన రహదారులపై పోలీసులు చెక్ పోస్టులను( Police Checkposts ) ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో చెక్ పోస్టుల వద్ద వాహనాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.అలాగే తాడిపత్రిలోని పలువురు పార్టీ నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాగా తాడిపత్రిలో ఇటీవల చోటు చేసుకున్న అల్లర్లపై అరెస్టుల పర్వం కొనసాగుతోంది.