ఈ క్రమంలో చంద్రబాబుని భారీ బందోబస్తు మధ్య విజయవాడ నుండి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తున్న క్రమంలో ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎటువంటి అల్లరులు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ విధించారు.ఈ మేరకు ఉన్నత అధికారుల నుండి అన్ని జిల్లాల పోలీస్ అధికారులకు ఆదేశాలు అందాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఏ మండలంలో, గ్రామాలలో, రోడ్లపై ప్రజలు గుంపులుగా ఉండకూడదని నిబంధనల అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.
అంతేకాదు సభలు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతులు ఇవ్వకూడదని పేర్కొన్నారు.ఈనెల 22 వరకు ఏసీబీ కోర్ట్( ACB Court ) చంద్రబాబుకి రిమాండ్ విధిస్తూ తీర్పు ఇవ్వటం జరిగింది.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు( TDP Activists ) ఆందోళన నిరసనలు చేపట్టే అవకాశం ఉండటంతో ముందస్తుగా పోలీసులు 144 సెక్షన్ అమలు చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే మరోపక్క ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు.గృహనిర్బంధంలో ఉంచేందుకు అనుమతి ఇవ్వాలని ఒక పిటిషన్, ఇంటి భోజనం, మందులు ఇచ్చేందుకు మరో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.
ప్రత్యేక భద్రత, వయసు, ఆరోగ్యం దృష్ట్యా.అనుమతులు ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు న్యాయస్థానాన్ని కోరడం జరిగింది.
ఈ రెండు పిటిషన్లపై వాదనలు కొనసాగుతున్నాయి.
త్రివిక్రమ్ కొడుకుకి సందీప్ రెడ్డి వంగ అంటే ఇష్టమా..? ఎందుకంటే..?