తెలంగాణపై మిచాంగ్ ప్రభావం..పలు ప్రాంతాల్లో వర్షాలు
TeluguStop.com
మిచాంగ్ తుపాన్ ఎఫెక్ట్ తెలంగాణపై కూడా పడింది.దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల్లో రాత్రి మోస్తరు వాన పడింది.కాగా ఇప్పటికే తుపాన్ ప్రభావంతో యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు నల్గొండ జిల్లాలకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
పలు చోట్ల రాత్రి నుంచి మోస్తరు వాన కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉంది.
రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఒడియా అబ్బాయిని పెళ్లాడిన అమెరికన్ వనిత.. ఆమె జీవితం ఎలా మారిందో చూడండి!