సమాజంపై చైసామ్ విడాకుల ప్రభావం.. ఆ జంటలు కూడా విడిపోయేలా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో లవ్లీ కపుల్ గా పేరుగాంచిన సమంత నాగ చైతన్య విడిపోవడం కొంతమేర అభిమానులకు ఆందోళన కలిగించింది.

ఈ క్రమంలోనే వీరి విడాకుల విషయంపై స్పందిస్తూ కొందరు బాధను వ్యక్తపరచటం మరికొందరు ఇదేం పెద్ద విషయం కాదు.

సమాజంలో ఎంతోమంది విడిపోతున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.అయితే చాలా మంది ప్రేక్షకుల జీవితాలపై సినీ తారల ప్రభావం ఉంటుందన్న విషయం మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈ క్రమంలోనే తమ అభిమాన హీరో హీరోయిన్లు ధరించినటువంటి స్టైల్లోనే దుస్తులు ధరించడం, వారి ఇష్టాయిష్టాలను వీరు అనుసరించడం వంటివి చేస్తుంటారు.

ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు సంపాదించుకున్న జంటలలో చైతన్య సమంత జంట ఒకటి.

ఎన్నో సంవత్సరాలు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వీరు విడాకులతో వీరి పెళ్లి బంధానికి ముగింపు పలికారు.

అయితే ఈ జంట తీసుకున్న విడాకుల ప్రభావం ఎంతో మంది పై పడవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సాధారణ ప్రజలు కూడా విడాకులు తీసుకోవాలని భావించే వారు వీరిని అనుసరించి విడాకులు తీసుకునే ప్రమాదముందని చెప్పవచ్చు.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2021/10/impact-of-chaitanya-nagachaitanya-orce-on-societys!--jpg "/ ఈ క్రమంలోనే ఈ జంట పలు మనస్పర్ధలు ఉన్నప్పటికీ వాటిని సర్దుకొని కలిసి పోతున్నాం అని ప్రకటిస్తే రేపే విడాకులు తీసుకోవాలనుకునే వారి అభిప్రాయాలు కూడా మారవచ్చు.

లేదా కొన్నిసార్లు విడాకులు తీసుకోవాలన్న ఆలోచన కూడా మానుకోవచ్చు.ఏది ఏమైనప్పటికీ సాధారణ ప్రజల జీవితంపై సినిమా సెలబ్రిటీల ప్రభావం ఎంతగానో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

వైవాహిక జీవితంలో కలిసి ఉండటం విడిపోవడం అనేది వారి వ్యక్తిగత విషయం అయినప్పటికీ కొద్దిగా ఓర్పు సహనంతో ఆలోచిస్తే అన్ని సమస్యలకు పరిష్కారాలు ఉంటాయని, విడిపోవడమే పరిష్కారమార్గం కాదు అంటూ పలువురు తెలియజేస్తున్నారు.

పబ్లిక్‌లో రొమాన్స్.. పోలీసుల రియాక్షన్ ఇదే