శరీరంలో ఇమ్యూనిటీ కోసమని వాటిని ఉపయోగిస్తున్నారా జాగ్రత్త సుమీ…!

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ చాపకింద నీరులాగా విజృంభిస్తుంది.ప్రస్తుత సమయంలో ప్రతి ఒక్కరు ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసం అనేక చిట్కాలను పాటిస్తున్నారు.

అంతేకాకుండా చాలా మంది డాక్టర్ సలహాలు లేకుండా విటమిన్ సి టాబ్లెట్ లను ఉపయోగిస్తున్నారు.

వాస్తవానికి ఈ టాబ్లెట్లు గతంలో చాలా తక్కువగా దొరికేవి.కానీ, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల ఈ టాబ్లెట్ లకు డిమాండ్ పెరగడం కారణంగా వీటి ధర కూడా చాలా పెరిగిపోయింది.

ఇక మరి కొన్ని ప్రదేశాలలో అయితే అసలు స్టాక్ కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది.

ఇక మరికొంతమంది అయితే స్ట్రిప్స్ కొద్ది టాబ్లెట్స్ ను కొనేసి వారి ఇళ్లలో పెట్టుకుంటున్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఆలోచించి ప్రతి ఒక్కరికి ఈ టాబ్లెట్స్ కావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా కేవలం 10 లేదా 20 మాత్రమే పెట్టుకోండని వైద్య అధికారులు తెలియజేస్తున్నారు.

మరోవైపు వైద్య అధికారులు మాత్రం విటమిన్లను ఆహార రూపంలో తీసుకోవడానికి ప్రయత్నించండి అంటూ సూచనలు ఇస్తున్నారు.

అలాగే చాలావరకు డాక్టర్ల సలహా లేకుండా ట్యాబ్లెట్లు తీసుకోవడం మంచిది కాదని నిపుణులు తెలియజేస్తున్నారు.

"""/" / ఇక ఎక్కువ శాతం విటమిన్ - సి తీసుకోవడం ద్వారా డయేరియా వాంతులు చాతిలో మంట లాంటి లక్షణాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య అధికారులు తెలియజేస్తున్నారు.

ఇక సి విటమిన్ పుష్కలంగా దొరకాలంటే నిమ్మరసం, బత్తాయి, నారింజ, కమల పండ్లు లాంటివి తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

అలాగే పెరుగులో కూడా పుష్కలంగా గుడ్ బ్యాక్టీరియా లభిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?