‘కరోనా’కు హెర్బల్ మైసూర్ పాక్.. చివరికి ఏమైందంటే?

కరోనా వైరస్.ప్రపంచాన్ని ఎలా అనిపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కోటి మందికి పైగా వ్యాపించింది.

ఆరు లక్షల మందికి పైగా ఈ కరోనా బలితీసుకుంది.ఇంకా అలాంటి వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే హెర్బల్ టీ తో, లెమన్ టీ తో వైరస్ ని తరిమికొట్టాచ్చంటూ ఈ మధ్యకాలంలో వార్తలు బాగా వస్తున్నాయి.

ఇంకా ఈ నేపథ్యంలోనే తమిళనాడుకు చెందిన ఓ స్వీట్ షాప్ లో కరోనా వైరస్ ను తియ్యగా చంపేయండి అంటూ చెప్పుకొచ్చింది.

అది ఎలా అనుకుంటున్నారా.అక్కడికే వస్తున్నా.

ఇన్నాళ్లు హెర్బల్ టి అని మనం అనుకున్నాం కదా అలాగే వారు కూడా హెర్బల్ మైసూర్ పాక్ ను తయారు చేసారట.

తమిళనాడులోని కోయంబత్తూరు లో ఉన్న ఈ స్వీట్ షాపులో తయారుచేసిన మైసూర్ పాక్ తింటే కరోనా వైరస్ అంతమైపోతుందట.

అంతేకాదు ఈ షాపు యజమాని మరో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాడు.అదేంటంటే కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వారికి ఈ మైసూర్ పాక్ ను ఉచితంగా ఇస్తాం అని ప్రకటించేశాడు.

మూలికలతో తయారు చేసిన ఈ మైసూర్ పాక్ శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అంటూ తెలిపాడు.

దీంతో చుట్టుపక్కల ప్రజలు క్యూ కట్టారు.అయితే అంతమంది కస్టమర్లు రావడంతో తన హెర్బల్ మైసూర్ పాక్ బాగా పనిచేస్తుందని భావించిన యజమాని ఏకంగా కేంద్ర ప్రభుత్వానికే ఆఫర్ ఇచ్చాడు.

దీంతో ఆరోగ్య శాఖ అధికారుల స్వీటు సంగతి ఏంటో తెలుసుకోవడానికి రంగంలోకి దిగారు.

అయితే యజమాని చెప్పినది అంత తప్పుడు సమాచారం అని.అది అంతా ఒక నాటకం అని ఆ వ్యాపారి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అధికారులు వెల్లడించారు.

దీంతో హెర్బల్ మందులు అన్నీ ఏమి తెలియకుండా ఉపయోగించకూడదని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

పర్షియన్ కార్పెట్ లాంటి కేక్ ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే ఫిదా..