ఇది విన్నారా.. కరోనా సోకిన పిల్లల్లో కొత్త స‌మ‌స్య!

ఎక్క‌డో చైనాలోని వూహాన్ న‌గ‌రంలో పురుడు పోసుకున్న క‌రోనా వైర‌స్‌.కంటికి క‌నిపించ‌కుండానే ప్ర‌పంచంలోని అన్ని దేశాలను క‌మ్మేసిన సంగ‌తి తెలిసిందే.

చాప కింద నీరులా విస్త‌రిస్తున్న క‌రోనా.ఇప్ప‌టికే ఏడు ల‌క్ష‌ల మందికి పైగా బ‌లితీసుకుంది.

ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసే స‌రైన‌ ఆయుధం అందుబాటులో లేక‌పోవ‌డంతో.రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి.

మ‌రోవైపు క‌రోనాపై వంద‌ల ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి.ఈ క్ర‌మంలోనే క‌రోనా గురించి ఎన్నో విష‌యాలు బ‌య‌ట‌ప‌డుతున్నారు.

ఇక కరోనా సోకిన కొందరు పిల్లల్లో ఓ కొత్త స‌మ‌స్య ఏర్ప‌డుతుంద‌ట‌.అదే పీడియాట్రిక్ ఇన్‌ఫ్లమేటరీ మల్టీసిస్టమ్‌ సిండ్రోమ్ ‌(ఐఎంఎస్‌-టీఎస్‌).

తాజాగా లండన్‌లో జ‌రిపిన ప‌రిశోధ‌నలో ఈ విష‌యం తేలింది అని కింగ్స్ కాలేజీ శాస్త్రవేత్తలు తెలిపారు.

"""/"/ మొత్తం 25 మంది కరోనా సోకిన పిల్ల‌ల‌ రక్త నమూనాలను వారు టెస్ట్ చేయ‌గా.

వారిలో క‌రోనా‌ లక్షణాలతో పాటు పీఐఎంఎస్‌-టీఎస్‌ లక్షణాలు ప‌రిశోధ‌కులు గుర్తించారు.పీఐఎంఎస్‌-టీఎస్‌ లక్షణాల వ‌ల్ల పిల్ల‌ల్లో రక్తనాళాల్లో మంటతోపాటు గుండె సమస్యలు ఎదురవుతున్నట్లు శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు.

అంతేకాకుండా.పీడియాట్రిక్ ఇన్‌ఫ్లమేటరీ మల్టీసిస్టమ్‌ సిండ్రోమ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే పిల్లల్లో సైకోటైన్లు పెరిగిపోయి రోగ‌ నిరోధక వ్యవస్థకు కీలకమైన తెల్ల రక్తకణాలు తగ్గిపోతున్నాయని గుర్తించారు.

అయితే కరోనా నుంచి కోలుకున్న అనంత‌రం వారి రోగ‌ నిరోధక వ్యవస్థ సాధారణ స్థితికి చేరుతుంద‌ని కింగ్స్ కాలేజీ శాస్త్రవేత్తలు స్ప‌ష్టం చేశారు.

ఇండస్ట్రీలో బోలెడంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ సొంత కాళ్ళ పైన ఎదుగుతున్న నటీనటులు