నకిలీ డాక్యుమెంట్లు , వీసా స్కాం : కెనడాలో భారతీయ ఇమ్మిగ్రేషన్ ఏజెంట్‌కు జైలు శిక్ష
TeluguStop.com
నకిలీ విద్యార్ధి వీసాలు, అడ్మిషన్ లెటర్స్ కుంభకోణానికి గాను భారత్‌లోని పంజాబ్‌కు చెందిన బ్రిజేష్ మిశ్రాను( Brijesh Mishra ) కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేరానికి సంబంధించి కెనడా అధికారులు అతనిపై మోపిన మూడు ఆరోపణల్లో దోషిగా తేలడంతో , బ్రిజేష్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.
బుధవారం వాంకోవర్‌లోని బ్రిటీష్ కొలంబియా ప్రొవిన్షియల్ కోర్టు( British Columbia Provincial Court ) ఎదుట మిశ్రాను హాజరుపరిచారు.
విచారణలో సాక్షులుగా హాజరైన కొంతమంది విద్యార్ధులకు కెనడియన్ ప్రభుత్వం లేఖ పంపింది.బ్రిజేష్‌కు ఇంకా 19 నెలల శిక్షాకాలం మిగిలి ఉండగా.
పెరోల్‌కు అర్హులని న్యాయస్థానం తెలిపింది.కెనడాలో( Canada ) పూర్తికాలం శిక్షను అనుభవించిన తర్వాత అతనిని బహిష్కరించే అవకాశాలు ఉన్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు.
"""/" /
కాగా.గతేడాది ప్రారంభంలో నకిలీ వీసాలు ,( Fake Visa ) ఫేక్ ఆఫర్ లెటర్లతో అడ్మిషన్లు సంపాదించిన 700 మంది భారతీయ విద్యార్ధులను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు కెనడా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ వ్యవహారం ఇరు దేశాల్లో ప్రకంపనలు సృష్టించింది.భారత్, కెనడాలకు చెందిన రాజకీయ పార్టీలు విద్యార్థుల పక్షాన నిలబడ్డాయి.
ఈ ప్రయత్నాలు ఫలించి విద్యార్ధుల బహిష్కరణ( Deportation ) ప్రక్రియను కెనడా ప్రభుత్వం నిలిపివేసింది.
అంతేకాదు.భారతీయ విద్యార్ధులకు( Indian Students ) తాత్కాలిక అనుమతులను కూడా జారీ చేస్తామని తెలిపింది.
వీసా మోసంపై విచారణను ప్రారంభించి, దేశంలోనే వుండేందుకు అవకాశం కూడా కల్పిస్తోంది. """/" /
ఇమ్మిగ్రేషన్ స్కామ్‌లో పంజాబ్‌కు చెందిన విద్యార్ధులే ఎక్కువ.
కెనడియన్ బోర్డర్ సర్వీస్ ఏజెన్సీ( Canada Border Services Agency ) ప్రకారం నకిలీ ఆఫర్ లెటర్స్‌తో అడ్మిషన్లు సంపాదించారన్నది వీరిపై వున్న అభియోగం.
ఈ విద్యార్ధులలో ఎక్కువమంది 2018, 2019లలో చదువుకోవడానికి కెనడా వచ్చారు.అయితే కెనడాలో శాశ్వత నివాసం కోసం విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఈ మోసం వెలుగుచూసింది.
విద్యార్ధులను తప్పుదోవ పట్టించిన వారు, మోసం చేసిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆ దేశ ప్రభుత్వం హెచ్చరించింది.
బాధిత విద్యార్ధులలో ఎక్కువమంది జలంధర్ నగరం కేంద్రంగా పనిచేస్తున్న కౌన్సెలింగ్ సంస్థ ఎడ్యుకేషన్ అండ్ మైగ్రేషన్ సర్వీసెస్ ఆస్ట్రేలియా (ఈఎంఎస్ఏ) ఏజెంట్ బ్రిజేష్ మిశ్రా ద్వారా కెనడాలో అడుగుపెట్టినట్లు తేలింది.
ఆంధ్రావాలా మూవీని తలదన్నేలా బాలయ్య మూవీ ఈవెంట్.. అన్ని లక్షల మంది వస్తారా?